సూపర్ స్టార్ రజినీకాంత్ గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన హాస్పటల్ లో చేరిన విషయం తెలిసిందే.. రజినీకాంత్ అనారోగ్య కారణాలతో 30వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఈరోజు చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు.
నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. అనారోగ్య కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారనే వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందారు. రక్తనాళాల వాపు వచ్చిందని, దాన్ని సరిచేయడానికి స్టెంట్ అమర్చారని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారనే వార్తతో అభిమానులను టెన్షన్‌కు గురి చేసింది.
ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వాబ్ పెరుందగై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో పాటు పలు ఇతర పార్టీలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. అలాగే సినీ సెలబ్రెటీలు కూడా రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కాగా, ఆయన పరిస్థితిపై అపోలో ఆస్పత్రి నివేదిక విడుదల చేసింది. అందులో, అతను గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని దా. దీనిని సెట్ చేయడానికి అపోలో ఆసుపత్రి నాన్ సర్జికల్ ట్రాన్స్‌కాథెటర్ పద్ధతిలో చికిత్స చేసి, స్టెంట్ ను ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రజనీకాంత్ మూడు రోజుల చికిత్స తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారని తెలుస్తోంది. ఇక రజినీకాంత్ వరుసగా లు చేస్తోంది. సూపర్ స్టార్ ప్రస్తుతం వేట్టైయన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ విడుదల కానుంది. ఈ తర్వాత రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ లో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు రజినీకాంత్ ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.