కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పాలిటిక్స్‌లోకి రానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. తాజాగా తండ్రి నిర్ణయంపై ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్ స్పందించారు.
విత్ లవ్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. తన తండ్రి నిర్ణయం పట్ల తమకెలాంటి బాధ లేదన్నారు. ఆయనకు ఏది నచ్చితే కుటుంబమంతా మద్దతుగా ఉంటుందని తెలిపారు.
అంతేకాకుండా రజనీ- కమల్‌హాసన్ సినిమాపై జరుగుతున్న ప్రచారంపై కూడా స్పందించారు. ఈ కాంబినేషన్ మూవీకి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అవీ ఓకే అయితే త్వరలోనే వివరాలను ప్రకటిస్తామన్నారు. కాగా.. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్ లవ్. ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.



































