ఢిల్లీ స్టేడియంలో సిక్సర్లు బాదబోతున్న రామ్ చరణ్.. పెద్ది మూవీ లేటెస్ట్ అప్డేట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆ మధ్యన విడుదలైన పెద్ది టీజర్ ఈ చిత్రానికి ఊహించని క్రేజ్ తెచ్చి పెట్టింది.


టీజర్ తో పెద్ది చిత్రానికి ఊహించని క్రేజ్

టీజర్ లో రామ్ చరణ్ కొట్టిన ఒక్క షాట్ దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయింది. సినీ, క్రికెట్ అభిమానులు ఆ షాట్ ని రీ క్రియేట్ చేస్తూ రీల్స్ కూడా చేశారు. దీంతో పెద్ది మూవీ క్రేజీ చిత్రంగా మారిపోయింది. రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రంలో నటిస్తున్నాడు. రంగస్థలంని మించేలా ఈ చిత్రం ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్లు పూర్తి కాగానే నాసిక్ లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది.

ఢిల్లీ స్టేడియంలో షూటింగ్

ఆ తర్వాత ఢిల్లీలోని స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో అత్యంత కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు. ఇవి ఈ చిత్రంలో ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన సన్నివేశాలు అని అంటున్నారు. ఈ మ్యాచ్ లో రామ్ చరణ్ బౌండరీల వర్షం కురిపించడం మాత్రమే కాదు పెర్ఫార్మెన్స్ అదరగొట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మ్యాచ్ నిజంగా ఢిల్లీలో జరుగుతున్నట్లే ఆడియన్స్ కి ఫీలింగ్ కలగాలనే  ఉద్దేశంతో బుచ్చిబాబు అక్కడే చిత్రీకరించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.