రామగుండం ఫెర్టిలైజర్స్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
‣ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) 35 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ, నోయిడాల్లోని ప్లాంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం 35 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 23, ఎస్సీలకు 05, ఎస్టీలకు 01, ఓబీసీలకు 05, ఈడబ్ల్యూఎస్‌లకు 01 కేటాయించారు.
1. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (ప్రొడక్షన్) – 8: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ/ కెమికల్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
2. ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (ప్రొడక్షన్) – 2: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ/ కెమికల్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18-40 ఏళ్లుండాలి. ఫెర్టిలైజర్స్/ కెమికల్/ పెట్రోకెమికల్/ హైడ్రోకార్బన్ పరిశ్రమలో 7 ఏళ్ల అనుభవం ఉండాలి.
3. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (మెకానికల్) – 03: మెకానికల్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18-30 సంవత్సరాలు ఉండాలి.
4. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (ఇన్‌స్ట్రుమెంటేషన్) – 04: ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18-30 ఏళ్లు ఉండాలి.
5. ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (ఇన్‌స్ట్రుమెంటేషన్) – 01: ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ డిప్లొమా పాసవ్వాలి. ఫెర్టిలైజర్స్/ కెమికల్/ పెట్రోకెమికల్/ పవర్ జనరేషన్/ డిస్ట్రిబ్యూషన్ పరిశ్రమల్లో 7 ఏళ్ల ఉద్యోగానుభవం. వయసు 18-40 సంవత్సరాలు ఉండాలి.
6. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (కెమికల్ ల్యాబ్) – 01: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ పాసవ్వాలి. వయసు 18-30 ఏళ్లు ఉండాలి.
7. ఆఫీస్ అసిస్టెంట్- గ్రేడ్-3: 04: ఏదైనా డిగ్రీ పాసవడంతోపాటు ఎంఎస్-ఆఫీస్‌లో నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్‌లో సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 18-30 ఏళ్లు.
29.02.2024 నాటికి తగిన విద్యార్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్/ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు.
పరీక్షలో..
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో.. రెండు పార్ట్‌లుగా ఉంటుంది. వ్యవధి 2 గంటలు. మొత్తం 150 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు
‣ పార్ట్-1లోని 100 ప్రశ్నలు పోస్టును బట్టి.. డిప్లొమా/ బీఎస్సీ/ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. పార్ట్-2లోని 50 ప్రశ్నలు.. జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్/ అవేర్‌నెస్‌కు సంబంధించినవి ఇస్తారు.
‣ నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలను రాయాలి. తెలియనివాటికి సమయం తీసుకుని ఆలోచించి గుర్తించవచ్చు.
‣ సీబీటీలో సాధించిన మార్కులు, కేటగిరీల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
‣ అన్‌రిజర్వుడ్/ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వేర్వేరుగా మెరిట్ లిస్ట్‌ను తయారుచేస్తారు.
‣ ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక చేస్తారు.
‣ ఎంపిక చేసిన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.
‣ సీబీటీని ఏ తేదీన, ఎక్కడ నిర్వహించేదీ అడ్మిట్ కార్డ్ ద్వారా తెలియజేస్తారు. ఈ కార్డ్‌ను సంస్థ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.. పోస్టులో పంపరు.
‣ తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శిస్తుండాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్; కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2024
వెబ్‌సైట్: https://www.rfcl.co.in/