పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని ఏథర్ బ్రాండ్ తన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్‌పై డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. ఏథర్ 450 ఎక్స్, ఏథర్ 450 అపెక్స్ ఈ- స్కూటర్స్‌పై ఉన్న డిస్కౌంట్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పండుగ సీజన్లో సేల్స్ పెంచుకునేందుకు దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ జాబితాలోకి భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సైతం చేరింది. తన 450 శ్రేణి స్కూటర్లపై ప్రత్యేక పండుగ సీజన్ డిస్కౌంట్లను ప్రకటించింది. 450ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లపై ఇప్పుడు మంచి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఎలక్ట్రిక్ స్కూటర్స్‌పై డిస్కౌంట్స్..
ఏథర్ 450, ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌పై మొత్తం రూ .25,000 వరకు డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫెస్టివల్ పీరియడ్ ఆఫర్లలో భాగంగా, ఏథర్ బ్యాటరీ వారంటీని ఎనిమిది సంవత్సరాలకు పొడిగిస్తోంది. వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా దీర్ఘకాలిక బ్యాటరీ పనితీరును ఆస్వాదించవచ్చు.
అదనంగా, ఏథర్ తన విస్తృతమైన ఏథర్ గ్రిడ్ నెట్వర్క్ ద్వారా ఒక సంవత్సరం పాటు ఉచిత ఛార్జింగ్‌ని అందిస్తోంది. ఇందులో దేశవ్యాప్తంగా 2,152 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. రూ.5,000 విలువైన ఈ కాంప్లిమెంటరీ ఛార్జింగ్ సర్వీస్ మరింత సౌలభ్యాన్ని ఇస్తుంది. రైడర్లకు గణనీయమైన వాల్యూని జోడిస్తుంది.
అంతేకాకుండా, కొనుగోలుదారులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ .5,000 ఇన్స్టెంట్ క్యాష్ డిస్కౌంట్ ప్రయోజనం పొందొచ్చు. ఇది పొదుపును పెంచుతుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇచ్చి, ఏథర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను మరింత అందుబాటులోకి తెచ్చింది.
ఏథర్ 450ఎక్స్- ఏథర్ 450 అపెక్స్..
450ఎక్స్ ఈ-స్కూటర్ రెండు బ్యాటరీ ఆఫ్షన్స్‌లో లభిస్తుంది: 2.9 కిలోవాట్, 3.7 కిలోవాట్. గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్‌తో కూడిన ఏడు ఇంచ్ టచ్‌స్క్రీన్ టీఎఫ్టీ డిస్ప్లేతో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పార్క్ అసిస్ట్, ఆటోహోల్డ్, ఫాల్సేఫ్ వంటి ఆసక్తికరమైన టెక్నాలజీ-ఎయిడెడ్ ఫీచర్లు ఈ 450ఎక్స్‌లో ఉన్నాయి. ఇది గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 146 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ స్కూటర్. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 195లక్షలు. 450 అపెక్స్ ఈ-స్కూటర్ మరింత శక్తివంతమైన మోటారుతో పనిచేస్తుంది. ఇది 7 కిలోవాట్ల గరిష్ట పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది, ఇది ప్రామాణిక 450ఎక్స్ కంటే 0.6 కిలోవాట్లు ఎక్కువ.
టార్క్ మారనప్పటికీ, కొత్త “వార్ప్+” రైడింగ్ మోడ్ గంటకు 100 కిలోమీటర్ల థ్రిల్లింగ్ టాప్ స్పీడ్‌ను అన్‌లాక్ చేస్తుంది. 2.9 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంతో, అథర్ 450 అపెక్స్ స్టాండర్డ్ మోడల్ కంటే కొంచెం వేగంగా ఉంటుంది.
“మ్యాజిక్ ట్విస్ట్” ఎనర్జీ మేనేజ్మెంట్ అల్గారిథమ్‌తో కనెక్ట్ చేసిన కొత్త అధునాతన రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టెమ్ మరొక ముఖ్యమైన ఫీచర్. బ్యాటరీ ఛార్జ్ స్థాయితో సంబంధం లేకుండా, బ్రేకులు అవసరం లేకుండా ఈ సిస్టెమ్ సున్నితమైన స్టాపింగ్, స్కూటర్‌ను పూర్తిగా నిలిపివేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ఆవిష్కరణ ప్రామాణిక మోడల్ పరిధి అయిన 150 కిలోమీటర్లతో పోలిస్తే సర్టిఫైడ్ రేంజ్‌ని (157 కిలోమీటర్ల) పెంచుతుంది.
450 అపెక్స్ 450ఎక్స్ నుంచి 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, సస్పెన్షన్ సెటప్‌ను పొందింది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టెమ్ (ఏబీఎస్) లేదు కానీ స్టాండర్డ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సెటప్ ఉంది.