ఒకే యువకుడు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు

www.mannamweb.com


ఒకే యువకుడు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి.
ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రంజిత్‌ ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఔరా అనిపిస్తున్నారు. గ్రామానికి చెందిన వేణుగోపాల్‌-అరుణ దంపతుల పెద్ద కుమారుడు రంజిత్‌. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివారు. ఏడు నెలల క్రితం రైల్వేశాఖలో టెక్నీషియన్‌ ఉద్యోగం, అనంతరం ఎక్సైజ్‌ పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 ఫలితాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తాజాగా శనివారం ప్రకటించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి పరీక్ష ఫలితాల్లో ఉద్యోగం పొందారు. రంజిత్‌ ప్రస్తుతం ఎక్సైజ్‌ పోలీసు కానిస్టేబుల్‌ శిక్షణలో ఉన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిపారు. నాలుగు ఉద్యోగాలు సాధించిన రంజిత్‌ను గ్రామస్థులతో పాటు పలువురు అభినందించారు.