Minor Rape: ఎన్‌టీఆర్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది.ఇంటర్మీడియట్ విద్యార్థినిపై లైంగిక దాడికి ముగ్గురు యువకులు పాల్పడ్డారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితురాలి తల్లి పేర్కొంది. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో వారం రోజుల తరువాత కేసు నమోదు చేశారు.
ఎన్‌టీఆర్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై లైంగిక దాడికి ముగ్గురు యువకులు పాల్పడ్డారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితురాలి తల్లి పేర్కొంది. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో వారం రోజుల తరువాత కేసు నమోదు చేశారు.
ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరులో ఇంటర్మీడియట్ చదువుతోన్న విద్యార్థినిపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌టీఆర్ జిల్లా విసన్నపేట మండలం ఒక గ్రామానికి చెందిన బాలిక తిరువూరులోని ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.
అదే గ్రామానికి చెందిన యువకుడు తోట చందు ఆ బాలికను ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పిన వినలేదు. ఏకంగా కాలేజీకి వెళ్లినప్పుడు వెంటపడేవాడు. అయితే వారం రోజుల క్రితం ఆ యువకుడు బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఇద్దరు మైనర్ బాలురులు సహాయం చేశారు.
అయితే తనపై అత్యాచారం చేశాడనే విషయాన్ని తల్లికి చెప్పడంతో, బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తన కుమార్తెను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఎస్ఐ కేసు నమోదు చేయకుండా, ఊళ్లోకెళ్లి పంచాయతీ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడని బాధితురాలి తల్లి వాపోయింది. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శులు వెళ్లువెత్తాయి.
బాధితురాలి తల్లి ఇంకా ఇక్కడ సమస్య పరిష్కారం కాదని భావించి, ఎన్‌టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్‌ను కలిసి సంఘటనపై ఫిర్యాదు చేసింది. తమకు గత్యంతరం లేకనే ఇక్కడు వచ్చామని, తమ ఊళ్లో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయకుండా, ఊళ్లో పంచాయతీ పెట్టుకోమని సలహా ఇవ్వడంతో ఇక్కడికి వచ్చానని తెలిపింది. దీంతో స్పందించిన పోలీస్ కమిషనర్, స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించించారు.
కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో పాటు నిందితులను పోలీసులు పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురిని పట్టుకుని తిరువూరు కోర్టులో సోమవారం హాజరుపరిచారు. న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో నిందితుడు చందును నూజివీడు సబ్ జైలుకు తరలించారు.
నిందితుడికి సహకరించిన ఇద్దరు మైనర్ బాలురుని విజయవాడలోని జువైనల్ హోంకు తరలించారు. సోమవారం కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తిరువూరు సీఐ కే. గిరిబాబు తెలిపారు. అయితే నిందితుడిపై ఇప్పటికే రెండు కేసులు నమోదు అయి ఉన్నాయి. రెడ్డిగూడెం మండలంలో ఒక కేసు, హైదరాబాద్‌లో ఒక మహిళను అల్లరిపాలు చేసిన కేసు నిందితుడుపై ఉన్నాయి.