Ratha Saptami: రథ సప్తమి ప్రాముఖ్యత ఏమిటి? నదీ స్నానం ఎందుకు చేయాలో తెలుసా..!

www.mannamweb.com


మాఘ మాసం శుద్ధ సప్తమి రోజుని సూర్య నారాయణుడి జన్మ దినోత్సవాన్ని రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యక్ష దైవం సూర్యుడిని పూజించే సంప్రదాయం ఉంది.
రథ సప్తమి రోజున తెల్లవారు జామునే నది స్నానం చేయడం చాలా ముఖ్యమైనది. సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం రథ సప్తమి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.ఆరోగ్యంగా ఉంటారు. ఈ నమ్మకం ఆధారంగా దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు.

రథసప్తమి ప్రాముఖ్యత?

పౌరాణిక కథ ఏమిటంటే మాఘమాసంలోని శుక్ల పక్షంలోని ఏడవ రోజు సప్తమి తిథిలో సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలు పెట్టాడు. కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. అంతేకాదు ఈ రోజున సూర్య భగవానుడి పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు.

రథసప్తమి ఈ ఏడాది ఎప్పుడంటే

పంచాంగం ప్రకారం మాఘ మాస శుక్ల పక్ష సప్తమి ఈ సంవత్సరం 15 ఫిబ్రవరి 2024 గురువారం ఉదయం 10.15 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే శుక్రవారం 16 ఫిబ్రవరి 2024 ఉదయం 8.58 గంటలకు ముగుస్తుంది. తేదీ ఆధారంగా రథసప్తమి స్నానాన్ని, స్నానం శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024న మాత్రమే ఆచరిస్తారు.
రథ సప్తమి పూజా విధానం

రథసప్తమి రోజున సూర్యోదయం తర్వాత భక్తులు స్నానాలు చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఈ సమయంలో భక్తుడు సూర్యభగవానునికి అభిముఖంగా నిలబడి నమస్కరిస్తాడు. అనంతరం నెయ్యి దీపం వెలిగించి, సూర్య భగవానుడికి ఎర్రటి పువ్వులు సమర్పించి సంప్రదాయాన్ని అనుసరిస్తూ పూజ చేస్తాడు. ఇలా అన్ని పద్ధతుల ప్రకారం సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా సూర్యభగవానుడు భక్తులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదిస్తాడని నమ్ముతారు.

రథసప్తమి రోజున ఈ తప్పులు చేయకండి

రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఎవరి పైన కోపం ప్రదర్శించరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో, చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి. మద్యం , మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని MannamWeb ధృవీకరించడం లేదు