ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా.. ఫైన్ కట్టాల్సిందే ? ఆర్బీఐ క్లారిటీ

www.mannamweb.com


ఈ రోజుల్లో ప్రతిఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి. ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ పెరుగుతున్న కొద్దీ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు కూడా పెరుగుతున్నారు.

అయితే బ్యాంక్ అకౌంట్స్ లో సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సాధారణంగా స్టూడెంట్ నుండి ఉద్యోగి, వ్యాపారి వరకు ప్రతి ఒక్కరికి ఉండేది సేవింగ్స్ అకౌంట్. ఈ సేవింగ్స్ అకౌంట్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, దీని పై బ్యాంకులు ఏమైనా ఫైన్ విధిస్తాయా.. ఇలాంటి అనుమానాలపై ఆర్బిఐ క్లారిటీ ఇచ్చింది.

ఇండియాలో ప్రస్తుతం చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉన్నాయి. ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటే జరిమానా విధించే అవకాశం ఉందన్న ఒక వార్త సోషల్ మీడియాలో ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది, ప్రత్యేకించి ప్రైవేట్ కంపెనీలలో పని చేస్తున్న వారిని. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీల్లో చాలా మంది ఉద్యోగులకి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటాయి.

మీరు ఎక్కడైనా ఉద్యోగాలు మారినప్పుడు కొత్త కంపెనీ పార్ట్నర్షిప్ బ్యాంక్‌తో మీ కోసం సాలరీ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తుంది. దింతో కొందరికి రెండు, నాలుగు లేదా ఐదు ఇలా వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్స్ మ్యానేజ్ చేయాల్సి వస్తుంది. ఆర్బీఐ మాజీ గవర్నరుని సూచిస్తూ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉన్న వారు భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని ఒక వార్త వెలువడింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఈ వార్త పై ఫాక్ట్ చెక్ నిర్వహించి కొట్టి పారేసింది. PIB ప్రకారం, కొన్ని కథనాలు రెండు బ్యాంకు అకౌంట్స్ ఉంటే జరిమానా విధించబడుతుంది అని అపోహను వ్యాప్తి చేస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ మాత్రం అలాంటి మార్గదర్శకాలేవీ జారీ చేయలేదు. ఈ వార్త పూర్తిగా తప్పు. ఇలాంటి పుకార్లు, తప్పుదోవ పట్టించే వార్తలను అస్సలు నమ్మవద్దని పీఐబీ ప్రజలకు సూచించింది.

భారతదేశంలో ఒక వ్యక్తికి ఉండాల్సిన బ్యాంకు అకౌంట్స్ గురించి ఎలాంటి రూల్ లేదు. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ అయినా తెరవవచ్చు. దీనికి ఆర్‌బీఐ ఎలాంటి రూల్స్, కండిషన్స్ విధించలేదు. అయితే మీరు ఎన్ని ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే వాటిలో కనీస బ్యాలెన్స్ మైంటైన్ చేయాలి. మీరు ఇలా చేయకపోతే మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. అయితే sms అలర్ట్స్, ఎటిఎం చార్జెస్ లాంటివి ఉంటాయని గమనించాలీ.