RBI Rules: ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై!

www.mannamweb.com


RBI Rules: ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై!

వేగంగా అభివృద్ధి చెందుతున్న, మారుతున్న బ్యాంకింగ్‌ ఇండస్ట్రీలో మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది.

మారుతున్న అవసరాలకు తగ్గట్లు వివిధ రకాల రిక్వైర్‌మెంట్స్‌ను సెంట్రల్ బ్యాక్ మారుస్తుంది. ఇందులో భాగంగానే క్యాష్ పే-ఇన్, పే-అవుట్ సర్వీసెస్‌ ట్రాక్ చేయడానికి డొమెస్టిక్‌ మనీ ట్రాన్స్‌ఫర్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ను కఠినతరం చేసింది. బ్యాంకులు, వాటి వ్యాపార భాగస్వాములకు కొత్త రిక్వైర్‌మెంట్స్‌ను ఆర్‌బీఐ బుధవారం జారీ చేసిన సర్క్యులర్‌లో తెలియజేసింది.

* కీలక మార్పులు

నగదు చెల్లింపుల కోసం(క్యాష్‌ పే అవుట్స్‌), బ్యాంకులు ఇప్పుడు డబ్బును స్వీకరించే వ్యక్తి (లబ్దిదారు) పేరు, అడ్రస్‌ నమోదు చేయాలి. ట్రేసబిలిటీని మెరుగుపరచడం, నిధులు సురక్షితంగా, సరైన వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నాయని నిర్ధారించే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నారు.

* క్యాష్‌ పే-ఇన్‌లో మార్పులు

క్యాష్‌ పే-ఇన్‌ (నగదు చెల్లింపుల స్వీకరణ) సర్వీసుకు సంబంధించి బ్యాంకులు, బిజినెస్‌ కరస్పాండెంట్స్ తప్పనిసరిగా వెరిఫైడ్‌ మొబైల్‌ నంబర్‌ ఉపయోగించి డబ్బు పంపే వ్యక్తిని (రెమిటర్) రిజిస్టర్‌ చేసుకోవాలి. అలానే అప్‌డేటెడ్‌ నో యువర్ కస్టమర్ (KYC) గైడ్‌లైన్స్‌లో పేర్కొన్న విధంగా, తప్పనిసరిగా చెల్లింపుదారు నుంచి సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ ‘అఫిషియల్లీ వ్యాలిడ్‌ డాక్యుమెంట్‌(OVD)’ తీసుకోవాలి. వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ మెరుగుపరచడానికి, మోసపూరిత లావాదేవీలను నిరోధించడానికి ఈ స్టెప్స్‌ రూపొందించారు.

* అదనపు భద్రత

రెమిటర్ ద్వారా జరిగే ప్రతి ట్రాన్సాక్షన్‌ను అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) ద్వారా వ్యాలిడేట్‌ చేయాలి. ఇది రెమిటర్‌ ద్వారా ట్రాన్సాక్షన్‌ జరుగుతోందని నిర్ధారించుకోవడానికి అదనపు సెక్యూరిటీ లేయర్‌గా ఉపయోగపడుతుంది. అలానే బ్యాంకులు తప్పనిసరిగా చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ, నగదు డిపాజిట్లకు సంబంధించి ఆదాయ పన్ను చట్టం నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

* ట్రాన్సాక్షన్‌ మెసేజ్‌ రిక్వైర్‌మెంట్స్‌

చెల్లింపు చేసే బ్యాంకు (Remitting Bank) తప్పనిసరిగా IMPS/NEFT ట్రాన్సాక్షన్‌ మెసేజ్‌లో చెల్లింపుదారు వివరాలను చేర్చాలి. ఈ మెసేజ్‌ తప్పనిసరిగా ట్రాన్స్‌ఫర్‌ను క్యాష్‌ బేస్డ్‌ రెమిటెన్స్‌గా కూడా గుర్తించాలి. పారదర్శకతను పెంపొందించడం, క్యాష్‌ ట్రాన్సాక్షన్స్‌ ట్రాకింగ్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ రిక్వైర్‌మెంట్స్‌ అమలు చేస్తున్నారు.

* మినహాయింపులు

కార్డ్-టు-కార్డ్ ట్రాన్స్‌ఫర్లు ఈ కొత్త నిబంధనల పరిధిలోకి రావు. ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు కొనసాగుతాయి. ప్రస్తుత రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కింద కార్డ్-టు-కార్డ్ ట్రాన్సాక్షన్లు సజావుగా జరుగుతాయి.

* మార్పులకు కారణం ఏంటి?

2011లో డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ (డీఎంటీ) ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి బ్యాంకింగ్ ఇండస్ట్రీ చాలా అభిృవృద్ధి చెందిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఇప్పుడు మరిన్ని బ్యాంకింగ్ అవుట్‌లెట్స్, ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్రస్‌కి అడ్వాన్స్‌డ్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌, సింప్లిఫైడ్‌ నో యవర్‌ కస్టమర్‌(KYC) రిక్వైర్‌మెంట్స్‌ ఉన్నాయి. అదనంగా, వినియోగదారులు ఇప్పుడు ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి వివిధ డిజిటల్ ఆప్షన్లు ఉపయోగిస్తున్నారు.

అందుకే రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రస్తుత సర్వీసులను సమీక్షించింది. మనీ ట్రాన్స్‌ఫర్‌ ప్రాసెస్‌లో సెక్యూరిటీ, కాంప్లియన్స్‌ పెంచడానికి ఈ మార్పులను చేసింది. ఈ కొత్త నియమాలను డొమెస్టిక్‌ మనీ ట్రాన్స్‌ఫర్స్‌లో సెక్యూర్‌, ట్రాన్స్‌పరెంట్‌ సిస్టమ్‌ తీసుకొచ్చేలా రూపొందించారు. ఫ్రాడ్‌, మిస్‌యూజ్‌లను నిరోధిస్తాయని భావిస్తున్నారు.