త్వరలో ఆర్‌బీఐ కొత్త మొబైల్‌ యాప్‌.. పెట్టుబడులు పెట్టడం మరింత సులువు

www.mannamweb.com


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ కొత్త మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. రిటైల్‌ ఇన్వెష్టర్ల కోసం తీసుకొస్తున్న ఈ యాప్‌ ద్వారా ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు అవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను 2021 నవంబర్‌లో ప్రారంభించింది. ఆర్‌బీఐ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం.. ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు.
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ కొత్త మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. రిటైల్‌ ఇన్వెష్టర్ల కోసం తీసుకొస్తున్న ఈ యాప్‌ ద్వారా ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు అవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను 2021 నవంబర్‌లో ప్రారంభించింది. ఆర్‌బీఐ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం.. ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు. రిటైల్‌ ఇన్వెస్టర్లు వేలంలో ఈ సెక్యూరిటీలను అమ్మడం/ కొనడం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌కు సంబంధించిన మొబైల్‌ యాప్‌ను తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలను తెలియజేసే క్రమంలో యాప్‌కు సంబంధించిన అంశాలను శక్తికాంత దాస్‌ ప్రస్తావించారు. యాప్ సిద్ధమవుతోందని, త్వరలోనే అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు.