ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేస్తోంది. రియల్‌మీ జీటీ సిరీస్ 7 ప్రో పేరుతో ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న తరుణంలో తాజాగా కంపెనీ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది.
వచ్చే నెలలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే తేదీ ఎప్పుడన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తున్న ప్రపంచంలోనే తొలి ఫోన్‌గా రియ్‌మీ జీటీ 7 ప్రో నిలవనుంది.
ఇక ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసర్‌ను అందించనున్నారు. Realme GT 7 Pro ఒరైన్ సీపీయూ స్ట్రక్చర్ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇక ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 4.32 గిగాహెర్ట్జ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ప్రస్తుతం అందుబటులోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సను అందిపుచ్చుకునే క్రమంలో దీని చిప్‌లో అడ్వాన్స్డ్ ఏఐ కేపబులిటీస్‌ను అందించను్నారు. కెమెరా విసయానికొస్తే ఇందులో ఏకంగా 320 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు.
యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 5జీ మోడెమ్-ఆర్ఎఫ్ సిస్టమ్, ఫాస్ట్ కనెక్ట్ 7300, 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ వంటి ఫీచర్లను ఇందులో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోన్లో 16 జీబీ ర్యామ్ను అందించారు. అందించనున్నారు. ఓఎల్‌ఈడీ ప్యానెల్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ పింట్ స్కానర్‌ను ఇవ్వనున్నారు.