ఐఫా ఉత్సవానికి సమంత.. ఆ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్న స్టార్ హీరోయిన్

www.mannamweb.com


ఏడాదిగా బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత ల కోసం ఆమె అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సామ్.

గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏమాయచేశావే తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్. ఈ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ లో నాగా చైతన్య హీరోగా నటించాడు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా నచ్చింది. ఆతర్వాత సమంత వరుస లతో బిజీగా మారిపోయింది. మహేష్ బాబుతో చేసిన దూకుడు ఈ అమ్మడి కెరీర్ కు మంచి మైలేజ్ ఇచ్చింది. దాంతో పెద్ద పెద్ద స్టార్ హీరోల ల్లో ఛాన్స్ కు అందుకుంది. అలా తక్కువ సమయంలోనే సమంత స్టార్ గా మారిపోయింది.

స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆతర్వాత ఈ ఇద్దరు అనూహ్యంగా విడాకులు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సామ్ ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె మాయోసైటిస్ బారిన పడటం దాని నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడం కోసం సామ్ ఏడాది పాటు లకు బ్రేక్ తీసుకుంది.ఇక ఇప్పుడు వరుసగా లతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది.

ఇక ఇప్పుడు సమంత ఐఫా ఉత్సవంలో పాల్గొననుంది. ఈ అవార్డుల ఉత్సవం సెప్టెంబరు 6, 7వ తేదీలలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో సామ్ ఓ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనుందని తెలుస్తోంది. ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా సామ్ అవార్డు అందుకోనుంది. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో జరిగిన ఐఫా ఉత్సవం 2024లో సమంత ఈ అవార్డును అందుకుంటుందని తెలుస్తోంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సామ్ చాలా సూపర్ హిట్ ల్లో నటించింది. సమంతను ఓ పవర్‌హౌస్ అని చాలా మంది ప్రశంసించారు. అలాగే తమిళభాషలోనూ తన సత్తా చాటింది. అక్కడ కూడా సూపర్ హిట్ ల్లో స్టార్ హీరోలతో జత జాట్టింది సామ్. వీటితో పాటు బాలీవుడ్ లో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్2 అనే వెబ్ సిరీస్ లోనూ నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. నటిగానే కాదు సేవాకార్యక్రమాల్లోనూ సామ్ ముందుంటుంది. అందుకే ఆమెకు ఐఫా ఉత్సవం వేదికగా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించనున్నారు.