చిలగడదుంపలు అందరికీ ఇష్టం. కానీ ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే వీటిని ప్రతిరోజూ తినవచ్చా? అని. చిలగడదుంపలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
మీరు ఒక నెల మొత్తం చిలగడదుంపలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కలిగే ప్రయోజనాలు చూసుకుంటే
చిలగడదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా శక్తిని విడుదల చేస్తాయి. దీని వల్ల మనకు రోజంతా శక్తి అందుతుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుందని పేర్కొంది.
ఒక మీడియం చిలగడదుంపలో మీ రోజువారీ అవసరం కంటే ఎక్కువ విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యం, చర్మం, రోగనిరోధక వ్యవస్థకు చాలా మంచిది. ఇది కాలానుగుణ వ్యాధుల నుండి కూడా మీ శరీరాన్ని రక్షిస్తుంది, బలపరుస్తుంది. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే పెద్ద మొత్తంలో విటమిన్ ఎ తీసుకోవడం పట్ల మీరు జాగ్రత్తగా ఉండండాలి.
చిలగడదుంపలలోని బీటా-కెరోటిన్ సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తుంది. డెర్మాటో-ఎండోక్రినాలజీ పరిశోధన ప్రకారం, కెరోటినాయిడ్లు అధికంగా ఉండే ఆహారాలు చర్మ రూపాన్ని మెరుగుపరుస్తాయి.
చిలగడదుంపలలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ పరిశోధన ప్రకారం, పొటాషియం అధికంగా ఉండే ఆహారం అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే, మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ చిలగడదుంపలు తినడం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు అవాహన మేరకు మాత్రమే అందించబడినవి.. ఇవి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మంచివి కాకపోవచ్చు, కాబట్టి మీరు వీటిని పాటించే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించండి)
































