ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పాలనలో సాంకేతికతో ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సూచించారు.
పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సమర్ధత లేకపోతే శిక్షణ ఇచ్చి, నిరంతరం పర్యవేక్షించాలని.. తద్వారా ఫలితాలు సాధించవచ్చన్నారు.
ఏఐ పాత్ర పెరగాలి – సీఎం చంద్రబాబు
సాంకేతికతతో గవర్నెన్స్‌లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృత స్థాయిలో వినియోగించుకునేలా ప్రోత్సహించేలా కోరారు. 2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మారాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని స్పష్టం చేశారు.
ఏఐ వినియోగించుకుని గ్రీవెన్సులు సత్వరంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… ఇక డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు.
మనమిత్ర – వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందించగలుగుతున్నట్టు…ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సూచనలు చేశారు.

































