PM Kisan Scheme: పీఎం కిసాన్ నిధులు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే?

www.mannamweb.com


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం రైతులకు శుభవార్త తెలియజేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’ (PM Kisan) నిధులను ఆయన విడుదల చేశారు. ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్రం.. ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా సహాయం అందనుంది.

ఎలా చెక్ చేసుకోవాలి

* ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ని (https://pmkisan.gov.in) ఓపెన్ చేయాలి.

* బెనిఫిషియరీ స్టేటస్ పేజీని క్లిక్ చేసి.. బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.

* రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి.

* గెట్ డేటాపై క్లిక్ చేసి.. బెనిఫిషియరీ స్టేటస్‌‌లోకి వెళ్లి పేమెంట్ పడిందో లేదో చెక్ చేయొచ్చు.

ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేయాలి?

కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల పీఎం కిసాన్ నిధులు లబ్ధిదారుల ఖాతాలోకి రాకపోవచ్చు. అలాంటి సమస్యలు తలెత్తితే.. pmkisan-ict@gov.in లో ఫిర్యాదు చేయాలి. లేకపోతే హెల్ప్‌లైన్ నంబర్ 155261, 1800115526లను సంప్రదించవచ్చు. మరో విషయం ఏమిటంటే.. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే, రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ పథకానికి మీరు అర్హులా? కాదా? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.