పండగల సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్ ను అనేక ఆఫర్లు ముంచెత్తుతున్నాయి. వివిధ రకాల తగ్గింపు ధరలతో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వివిధ దుకాణాల యజమానులు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు.
పండగల షాపింగ్ చేసే వారితోమార్కెట్ కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తన వినియోగదారులకు దీపావళి ధమాకా ఆఫర్ ను ప్రకటించింది. తన యూజర్లకు ఏడాది పాటు ఉచితంగా జియో ఎయిర్ ఫైబర్ సేవలను, ఏడాది పాటు వార్షిక మొబైల్ రీచార్జిని అందించనుంది. అదనపు ఖర్చు లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందిస్తోంది. ఈ ఆఫర్ వ్యవధి సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుంది.
నిబంధనలు ఇవి..
రిలయన్స్ జియో అందిస్తున్న ఆఫర్ ను పొందటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏదైనా రిలయన్స్ డిజిటల్ లేదా మై జీయో స్టోర్ లో రూ.20 వేల కంటే ఎక్కువ కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. వీరు ఏడాది పాటు ఉచితంగా ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అందుకుంటారు. అలాగే ఇప్పుటికే జియో ఎయిర్ ఫైబర్ వినియోగిస్తున్న వారు రూ. 2,222తో మూడు నెలల దీపావళి ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ కు అర్హులవుతారు. వీరితో పాటు జియో ఫైబర్ వినియోగదారులు కూడా వన్ టైమ్ అడ్వాన్స్ రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ప్రయోజనం పొందుతారు.
12 కూపన్లు..
ఆఫర్ లో భాగంగా వినియోగదారులు 2024 నవంబర్ నుంచి 2025 అక్టోబర్ వరకూ ప్రతి నెలా ఒక్క కూపన్ చొప్పున 12 కూపన్లు పొందుతారు. ప్రతి కూపాన్ వినియోగదారుడి యాక్టివ్ జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ విలువతో సరిపోతుంది. రిలయన్స్ డిజిటల్, మైజియో, జియో పాయింట్, జియో మార్ట్ లతో వీటిని రీడిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులు దాన్ని స్వీకరించిన 30 రోజులలోపు ఎలక్ట్రానిక్స్‌పై రూ. 15వేలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాలి.
ఏడాది మొబైల్ రీచార్జి ఉచితం..
రిలయన్స్ జియో తన ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సర్వీస్ ను మరింత ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా జియో వార్షిక మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ఒక ఏడాది పాటు ఉచితంగా అందజేయనుంది. కొత్తగా ఎయిర్ ఫైబర్ ప్లాన్‌కి సైన్ అప్ చేయడం ద్వారా వినియోగదారులు ఈ ఆఫర్ పొందవచ్చు. 365 రోజులు చెల్లుబాటులో ఉండే రూ.3,599 విలువైన వార్షిక మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను ఉచితంగా అందుకుంటారు.
సేవలు..
జియో సంస్థ తన మొబైల్ యూజర్ల కోసం ఐయాక్టివేట్ సేవను ప్రారంభించింది. దీని ద్వారా ఇళ్ల నుంచే సిమ్ కార్డ్‌లను యాక్టివేట్ చేసుకునే వీలుంటుంది. అలాగే జియో ఏఐ క్లౌడ్ వెల్ కమ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా యూజర్లకు 100 జీబీ వరకూ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. తమ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు.