ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ లో 4G, 5G కనెక్టివిటీని అందించడానికి రిలయన్స్ జియో భారత సైన్యంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ చర్యలతో రిలయన్స్ మరోసారి దేశభక్తిని చాటుకుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో 5G బేస్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మొదటి టెలికాం ప్రొవైడర్ గా రిలయన్స్ జియో నిలిచింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మొత్తం ఇన్-హౌస్ 5G సాంకేతికతను మోహరించిన మొదటి ఆపరేటర్ గా జియో నిలిచింది.
జియో ఎంట్రీతో ఇకపై సియాచిన్ హిమానీనద ప్రాంతంలో భారత సైన్యానికి 4G, 5G సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మైలురాయిని చేరుకోవడానికి జియో భారత సైన్యంతో కలిసి పనిచేసింది.
రిలయన్స్ జియో దేశ సేవ చేస్తున్న ఆర్మీ జవాన్లకోసం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇలా నెట్ వర్క్ అందుబాటులోకి రావడంతో ఇకపై సియాచిన్ లో విధులు నిర్వర్తించే జవాన్లు తమ కుటుంబసభ్యులతో కనెక్ట్ కావచ్చు. వారికి కుటుంబసభ్యులను దగ్గరచేయడంలో రిలయన్స్ జియో సక్సెస్ అయ్యింది.