కిచెన్‌లో సింక్ మురికిగా ఉందా.. మొండి మరకలను తొలగించి.. కేవలం 5 నిమిషాల్లో కొత్తలా మెరిసే సీక్రెట్ చిట్కా ఇదే..!

కిచెన్ సింక్‌ను బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మకాయ, ఉప్పు, టూత్ పేస్ట్‌తో సులభంగా శుభ్రం చేసి మెరిసేలా మార్చవచ్చు. నిపుణుల సూచనలపై ఆధారపడిన చిట్కాలు.


కిచెన్‌లో ప్రతి రోజు సింక్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. పాత్రలు కడగడం నుండి కూరగాయలు శుభ్రం చేయడం వరకు, దాదాపు రోజు మొత్తం దాని మీదే పని సాగుతుంది. ఫలితంగా సింక్‌పై మరకలు, పసుపు పొర, మచ్చలు, మురికి పేరుకుపోతాయి. దీంతో దానిని ఎన్నిసార్లు శుభ్రం చేసినా, కొద్దిరోజులకే మళ్లీ మురికిగా మారిపోతుంది. కానీ ఇప్పుడు ఆ సమస్యకు సులభమైన పరిష్కారం ఉంది. కష్టపడి దానిని తోమాల్సిన పనిలేదు.. కేవలం కొన్ని ఇంటి చిట్కాలతో సింక్‌ను నిగనిగలాడేలా మార్చవచ్చు.

మొదటగా బేకింగ్ సోడా అద్భుత ఫలితాలు ఇస్తుంది. దీనిని క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా పిలుస్తారు. సింక్ మీద పసుపు రంగు పొర లేదా మరకలు కనిపిస్తే, కొద్దిగా బేకింగ్ సోడా చల్లి తడి గుడ్డతో సాదాసీదాగా రుద్దాలి.. ఆ తర్వాత ఐదు నుంచి పది నిమిషాల తర్వాత నీటితో కడిగితే సింక్ కొత్తదానిలా మెరిసిపోతుంది. ఇది కేవలం శుభ్రతే కాదు.. మురికి, వాసనలు కూడా తొలగిస్తుంది.

మరో అద్భుతమైన కలయిక వెనిగర్, నిమ్మకాయ. స్టెయిన్లెస్ స్టీల్ సింక్‌లపై పేరుకుపోయిన ధూళి, మరకలు, వాసనలు తొలగించడానికి ఇది అద్భుతమైన చిట్కా.. సింక్ మీద కొద్దిగా వెనిగర్ చల్లుకుని, సగం నిమ్మకాయతో తేలికగా రుద్దాలి. ఇది మరకలను తొలగించడమే కాదు, సింక్ చుట్టూ తేలికపాటి నిమ్మ సువాసనను వ్యాప్తి చేస్తుంది.

సింక్‌లో మురికి పేరుకుపోయి ఉన్నట్లయితే, డిష్ వాషింగ్ లిక్విడ్‌లో కొద్దిగా ఉప్పు కలపడం చాలా ఉపయోగకరం. దాన్ని సింక్‌లో చల్లి ఐదు నిమిషాలు వదిలేస్తే చాలు. తర్వాత తడి గుడ్డతో తుడవండి. సింక్ తక్షణమే శుభ్రంగా, మెరిసేలా మారిపోతుంది.

సింక్‌లో మురికి పేరుకుపోయి ఉన్నట్లయితే, డిష్ వాషింగ్ లిక్విడ్‌లో కొద్దిగా ఉప్పు కలపడం చాలా ఉపయోగకరం. దాన్ని సింక్‌లో చల్లి ఐదు నిమిషాలు వదిలేస్తే చాలు. తర్వాత తడి గుడ్డతో తుడవండి. సింక్ తక్షణమే శుభ్రంగా, మెరిసేలా మారిపోతుంది.

అంతేకాదు సింక్ పై తేలికపాటి గీతలు లేదా మరకలు ఉంటే, వాటిని టూత్ పేస్ట్‌తో తుడవడం కూడా చాలా ఉపయోగకరం. మృదువైన వస్త్రంతో టూత్ పేస్ట్ రాసి సర్క్యులర్‌గా తుడవండి. దంతాలను మెరిపించే టూత్ పేస్ట్, సింక్‌ను కూడా అద్దంలా మెరిపిస్తుంది.

ఇక కిచెన్ సింక్‌ను శుభ్రం చేయడానికి గంటల తరబడి రుద్దాల్సిన అవసరమే లేదు. పైన చెప్పిన ఈ సింపుల్ ఇంటి చిట్కాలు కేవలం నిమిషాల్లోనే సింక్‌ను నిగనిగలాడేలా మార్చేస్తాయి. మీరు ఒక్కసారి ఈ చిట్కాలు ప్రయత్నిస్తే, సింక్ ఇలా ఎలా మెరుస్తోంది అని అడగకుండా ఉండలేరు. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.