తెల్ల జుట్టు నివారణ: తెల్ల జుట్టు సమస్య చిన్న వయస్సు నుండి పెద్ద వయస్సు వరకు అనేకరకాలుగా వ్యక్తులను బాధిస్తుంది. ప్రస్తుత కాలంలో సరికాని జీవనశైలి, కాలుష్యం మరియు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా తెల్ల జుట్టు సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది.
అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
సాధారణంగా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి హెన్నా లేదా రసాయనాలతో కూడిన హెయిర్ డైలు ఉపయోగిస్తారు. కానీ ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కలిగి జుట్టును పొడిగా, నిర్జీవంగా మార్చే ప్రమాదం ఉంది. దీనికి బదులుగా మునగ ఆకులను ఉపయోగించి సహజమైన పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కొబ్బరి నూనెలో మునగ ఆకులను కాచి జుట్టుకు పూయడం వల్ల తెల్ల జుట్టు సమస్యకు తక్షణమే ఫలితాలు కనిపిస్తాయి.
మునగ ఆకులలో తెల్ల జుట్టును నిరోధించే పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, బయోటిన్, ఇనుము మరియు జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించడానికి ముందుగా మునగ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. తర్వాత కొబ్బరి నూనెలో ఈ పొడిని కలిపి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పూసుకుని 30 నిమిషాల నుండి ఒక గంట వరకు వదిలేసి, తర్వాత తలస్నానం చేయాలి. ఇది తెల్ల జుట్టు సమస్యను క్రమంగా తగ్గిస్తుంది.
మరింత ఫలితాల కోసం రోజ్ వాటర్ లేదా రైస్ వాటర్ కలిపి కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా మెంతులు పొడిని కలిపి ఉపయోగిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి.