రెజ్యూమ్ అనేది జాబ్ (Job) పొందడానికి డోర్స్ ఓపెన్ చేసే ఒక తాళం లాంటిది. ఇదే బాగోలేకపోతే జాబ్ హైరింగ్ (Hiring) ప్రాసెస్‌లో మొదటి మెట్టు వద్దే వెనక్కి తిరగాల్సి వస్తుంది.
హైరింగ్ మేనేజర్లకు స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్, అచీవ్‌మెంట్స్ స్పష్టంగా తెలియజేయడానికి రెజ్యూమ్ ఒక చక్కని అవకాశాన్ని అందిస్తుంది. దీనిని సద్వినియోగం చేసుకొని అందరికంటే భిన్నంగా నిలవాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉంటుంది. ఇందుకు CVలో పవర్ వర్డ్స్ ఉపయోగించడం చాలా కీలకం. ముఖ్యంగా కొన్ని పదాలను వాడితే జాబ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అవేంటో తెలుసుకోండి.
అచీవ్డ్ (Achieved)
ఉద్యోగార్థులు రెజ్యూమ్‌లో విజయాలు, సాధించిన గొప్ప ఫలితాలను తెలియజేయడానికి ఈ పదం వాడాలి. అచీవ్డ్ (Achieved) ఉపయోగించినప్పుడు, తప్పనిసరిగా లక్ష్యాన్ని చేరుకున్నామని లేదా అధిగమించామని చెప్పినట్లు అవుతుంది. అలానే పనులను పూర్తి చేయగల సత్తా ఉన్న హై-అచీవర్ అభ్యర్థిని అని హైరింగ్ మేనేజర్లకు స్పష్టంగా తెలియజేయడం సాధ్యమవుతుంది.
లెడ్ (LED)
లీడర్‌షిప్ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పడానికి రెజ్యూమ్‌లో లెడ్ (LED) పదం వాడాలి. “లెడ్” ఉపయోగించి ఒక టీమ్‌ను లీడ్ చేశామని లేదా ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడానికి సహోద్యోగులను గైడ్ చేశామని చెప్పవచ్చు. తద్వారా బాధ్యతలు స్వీకరించే సామర్థ్యం ఉందని, సాధారణ లక్ష్యాలను సాధించడానికి ఇతరులను ప్రేరేపించగలమని హెచ్ఆర్లకు సింపుల్‌గా తెలియజేయవచ్చు.
ఇన్‌ఫ్లూయన్స్డ్ (Influenced)
మార్పు తీసుకురాగల సామర్థ్యం ఉందని చూపించడానికి ఇన్‌ఫ్లూయన్స్డ్ (Influenced) వర్డ్ వాడటమే ఉత్తమ మార్గం. Influenced పదంతో ఇతరులు ఆలోచించే లేదా ప్రవర్తించే విధానాన్ని మార్చామని, ఆ మార్చగలమనే శక్తి ఉందని తెలియజేయవచ్చు. ఈ లక్షణం వల్ల అభ్యర్థులు కంపెనీకి విలువైన ఆస్తి అవుతారని హెచ్‌ఆర్ మేనేజర్లు అనుకుంటారు.
ఇన్నొవేటెడ్ (Innovated)
క్రియేటివిటీ, ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్ హైలైట్ చేయడానికి ఈ పదం సరైనది. “ఇన్నొవేటెడ్” వర్డ్‌తో ఒక ప్రక్రియ లేదా ప్రొడక్ట్‌ను ఇంప్రూవ్ చేయడానికి కొత్తగా ఆలోచనలు చేసామని లేదా పరిష్కారాలు కనిపెట్టామని చెప్పవచ్చు. ఇది రెజ్యూమ్‌లో రాయడం వల్ల ఔట్ ఆఫ్ ది బాక్సింగ్ థికింగ్‌కు భయపడని, ఫార్వర్డ్‌గా ఆలోచించే అభ్యర్థి అని కంపెనీలు అర్థం చేసుకుంటాయి.
స్ట్రీమ్‌లైన్డ్ (Streamlined)
సామర్థ్యాన్ని, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోగలమని చెప్పడానికి “స్ట్రీమ్‌లైన్డ్” అని CVలో స్పష్టంగా రాయాలి. ఈ వర్డ్‌తో ఏ పని అయినా సమర్థవంతంగా చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనగలమని తెలియపరచవచ్చు. ఈ పవర్‌ఫుల్ వర్డ్ ఉపయోగించడం వల్ల సదరు అభ్యర్థి కంపెనీ సమయాన్ని, డబ్బును ఆదా చేయడంలో విలువైన ఆస్తి అవుతారని నిర్వాహకులు భావిస్తారు.
రివిటలైజ్డ్ (Revitalized)
టీమ్, ప్రాజెక్ట్ లేదా సంస్థకు కొత్త ఎనర్జీని అందించగలమని చూపించడానికి ఈ పదం వాడాలి. “రివిటలైజ్డ్”తో స్తబ్దుగా ఉన్న లేదా పనితీరు తక్కువగా ఉన్న దాన్ని విజయవంతంగా మెరుగుపరిచామని తెలియజేయవచ్చు. రిస్క్ తీసుకోవడానికి భయపడని అభ్యర్థినని HRs భావించేలా చేయవచ్చు.
ఇంప్లిమెంటెడ్ (Implemented)
ఒక ఆలోచనను కాన్సెప్ట్ నుంచి రియాలిటీకి తీసుకెళ్లగలమని చూపించడానికి ఈ పదం సరైనది. “ఇంప్లిమెంటెడ్” వర్డ్‌తో ఒక ప్లాన్‌ను అమలులోకి తెచ్చామనే విషయాన్ని CVలో హైలెట్ చేయవచ్చు. ఒక పనిని పూర్తి చేయగలమనే నమ్మకాన్ని రిక్రూటర్లలో పెంచి జాబ్ సొంతం చేసుకోవచ్చు.