Best Resume Tips: జాబ్‌ కోసం అప్లై చేసేముందు రెజ్యూమ్‌ బాగుండాలి.. ఈ తప్పులు చేయవద్దు..!

www.mannamweb.com


Best Resume Tips: కొత్త జాబ్‌ కోసం అప్లై చేసేముందు రెజ్యూమ్‌ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే దీనిని బట్టే మీకు జాబ్‌ వస్తుందా రాదా అనే విషయం తెలిసిపోతుంది.
హెచ్‌ఆర్‌లు రెజ్యూమ్‌లో ఉన్న వివరాలను చూసే ఇంటర్వూ లిస్టును తయారుచేస్తారు. ఇందుకోసం అసవసరమైన విషయాలు కాకుండా అవసరమయ్యే వివరాలతో రెజ్యూమ్‌ తయారుచేయాల్సి ఉంటుంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

విజయాల గురించి తెలపండి

అభ్యర్థులు రెజ్యూమ్‌లో ఎన్ని కంపెనీలు, ఏ ఏ పోస్ట్‌లలో పనిచేశారో పేర్కొంటారు. కానీ సంబంధిత కంపెనీలో మీరు సాధించిన విజయాలను చెప్పరు. వీటి గురించి రెజ్యూమ్‌లో తెలియజేయాలి. దీనివల్ల మిగతా వారితో పోలిస్తే మీరు కొంచెం భినంగా కనిపించి ఎంపిక చేసుకునే అవకాశాలు పెరుగుతాయి.

ప్రొఫైల్‌కు సంబంధించిన వివరాలు
రెజ్యూమ్‌ మీరు చేసే ఉద్యోగ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఉండాలి. పోస్ట్‌కు సంబంధం లేని అనవసర సమాచారం అందులో ఉండకూడదు. చాలా సార్లు అభ్యర్థులు తమను తాము మంచి వ్యక్తులుగా నిరుపించుకోవడానికి అవనవసరమైన సమాచారాన్ని రెజ్యూమ్‌లో పొందుపరిచి తర్వాత ఇబ్బందులు పడుతుంటారు.

అనవసరమైన పదజాలం వద్దు

అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను ఆకర్షణీయంగా మార్చడానికి వింత పదాలను వాడుతారు. ఇలా ఎప్పుడు చేయకూడదు. దీనివల్ల రెజ్యూమ్‌ చూసే హెచ్‌ ఆర్‌కు మీపై నెగిటివ్‌ ఇంపాక్ట్‌ పడుతుంది. మీ రెజ్యూమ్ ఫార్మాట్ సరిగ్గా ఉన్నప్పుడే కంపెనీ HR మీ రెజ్యూమ్‌ని చూస్తుంది. చాలా పెద్దగా, అనవసరమైన వివరాలను కలిగి ఉన్న రెజ్యూమ్‌లు పక్కన పడేస్తారు.

స్పెషలైజేషన్ పేర్కొనడం మర్చిపోవద్దు

మీరు మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఏదైనా స్పెషలైజేషన్ లేదా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉంటే దానిని రెజ్యూమ్‌లో కచ్చితంగా పేర్కొనాలి. ఈ పొరపాటు వల్ల మంచి ఉద్యోగం చేతుల్లోంచి జారిపోతుందని గుర్తుంచుకోండి.