LIC Jeevan Tarun : మీ పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చే సరికి విద్య, వివాహానికి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ అందిస్తుంది. మీరు ప్రతి రోజు రూ.171 ప్రీమియం చెప్పున పిల్లలకు 20 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తే రూ.28 లక్షల మెచ్యూరిటీ పొందుతారు.
LIC Jeevan Tarun : ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలని ఆశపడుతుంటారు. అందుకే ఎంత కష్టమైనా పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తుంటారు. అలాగే వారి ఆర్థిక భరోసా కోసం ఎంతో కొంత సేవ్ చేస్తుంటారు. పిల్లల చిన్న వయస్సు నుంచి వారి పేరుతో పెట్టుబడి పెట్టి విద్య, పెళ్లి ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎల్ఐసీ చక్కటి ప్లాన్ అందిస్తుంది. ‘ఎల్ఐసీ జీవన్ తరుణ్’ ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మీ పిల్లల భవిష్యత్ కు ఢోకా లేకుండా ఆర్థిక భరోసా అందించవచ్చు.
ఎల్ఐసీ జీవన్ తరుణ్ అర్హతలు
ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ తీసుకునేందుకు మీ పిల్లలకు కనీస ప్రవేశ వయస్సు 90 రోజులు, గరిష్టంగా 12 సంవత్సరాలు. 20 ఏళ్ల వరకు మీరు ప్రీమియమ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్లాన్ తీసుకున్నప్పుడు మీ పిల్లవాడి వయసు 8 ఏళ్లు అయితే (20-8=12) మీరు 12 ఏళ్లు ప్రీమియమ్ చెల్లిస్తారు. ఆ తర్వాత ఐదేళ్లు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే 5 సంవత్సరాలు మీరు ఎలాంటి ప్రీమియమ్ చెల్లించాల్సిన అవసరంలేదు. ఈ పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చాక పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. 9 నెలల నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్ లో మీకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. ఈ ఆప్షన్స్ ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు.
కనీసం రూ.75 వేలు
పాలసీదారులు సరెండర్ విలువను పొందిన తర్వాత రుణాన్ని కూడా పొందవచ్చు. ఈ పాలసీలో కనీసం రూ. 75,000 బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎంచుకోవాలి. గరిష్టంగా ఎంతైనా కట్టవచ్చు. ప్రీమియమ్ చెల్లింపులు ప్రతి నెల, 3 నెలలు, ఆరు నెలలు, ఏడాదికి చెల్లించవచ్చు. ఎల్ఐసీ జీవన్ తరుణ్ పిల్లల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు చేసుకునే విధానం. ఈ స్కీమ్ లో రాబడి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీ కుమార్తెకు 5 ఏళ్ల అనుకోండి. ఆమె వయస్సును బట్టి పాలసీ వ్యవధి 15 సంవత్సరాలు ఉంటుంది. అయితే మీరు 15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. మీరు మొత్తం రూ.1 లక్ష కట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్లాన్ లో అందుబాటులో ఉన్న నాలుగు ఆప్షన్లలో నాల్గోవది ఎంచుకున్నారు. మీ కుమార్తెకు 20 ఏళ్ల వచ్చినప్పటి నుంచి 24 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 15% సర్వైవల్ బెనిఫిట్ పొందుతారు. 25 ఏడాదిలో 25%కి సమానమైన మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పొందుతుంది. దీన్ని బట్టి బోనస్ అందిస్తారు.
మీరు వార్షిక ప్రీమియం ద్వారా రూ. 6200 ప్రీమియంగా చెల్లిస్తారు. 15 సంవత్సరాలకు దాదాపు రూ. 93,000 చెల్లిస్తారు. 20 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, ఎంచుకున్న ప్లాన్ ప్రకారం మీ అమ్మాయికి రూ. 15,000 లేదా హామీ మొత్తంలో 15% అందిస్తారు. ఈ మొత్తం ఆమెకు 24 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తారు. ఆమె 25వ పుట్టినరోజున ప్లాన్ లో మిగిలిన మొత్తాన్ని అంటే రూ. 25,000 చెల్లిస్తారు.
సర్వైవల్ బెనిఫిట్ (సమ్ హామీ మొత్తంలో %)
(వయస్సు 20 నుండి 24 సంవత్సరాలు)
మెచ్యూరిటీ బెనిఫిట్ (సమ్ హామీ మొత్తంలో %)
ఆప్షన్ 1 సున్నా 100 శాతం
ఆప్షన్ 2 సంవత్సరానికి 5% 75 శాతం
ఆప్షన్ 3 సంవత్సరానికి 10% 50 శాతం
ఆప్షన్ 4 సంవత్సరానికి 25 % 25 శాతం
మీ పాప పుట్టిన 2 ఏళ్ల నుంచి(రూ.12 లక్షల మొత్తం) 18 ఏళ్ల పాటు ప్రీమియం(నెలలకు రూ.5035, ఏడాదికి రూ.59107) చెలిస్తే మీ పెట్టుబడి రూ.10.891 లక్షలు అవుతుంది. మీ పాపకు 25 ఏళ్ల వయస్సు వచ్చే సరికి బోనస్, ఇతర బెనిఫిట్స్ కలుపుకుని రూ. 28.24 లక్షలు అందుతాయి.
Disclaimer : ఈ ఆర్టికల్ మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. ఏ పాలసీలోనైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.