రేవంత్ రెడ్డి టాలీవుడ్ భేటీ తర్వాత.. బన్నీని కలిసి ఆయన భజన చేసిన స్టార్స్ అంత యాంటీ అయిపోయారు. ఒక్కసారిగా బననీదే తప్పంటూ అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలెయ్యాయి.
అయితే మీటింగ్‌కు టాలీవుడ్ పెద్ద తలకాయ అయినా చిరంజీవి రాలేదన సంగతి తెలిసిందే. దీనికి కారణాలు సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అయ్యాయి. తాజాగా మరో సంచల వార్త హాట్ టాపిక్ గా మారింది. అసలు చిరంజీవి ఆ మీటింగ్‌కు రావద్దని రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించాడని తన టీంతో కాల్ చేయించాడని సమాచారం.
ఈ మీటింగ్ కు పిలిచి అలా చేయండి.. ఇలా చేయండి అంటూ అంత గొప్ప వ్యక్తికి చెప్పడం సరైనది కాదని.. ఆయనకు సమాజం పట్ల బాధ్యత ఉందని.. అలాంటి వ్యక్తికి మీటింగ్లో కూర్చోబెట్టి ఏం చేయాలో ఆదేశించాల్సిన అవసరం ఉండదని.. సీఎం అలాంటి పని చేశాడని తెలుస్తుంది. అంతేకాదు.. అల్లు అర్జున్ విషయంలో మేనల్లుడిదే తప్పు ఉందని చిరుకి తెలిసినా.. కాస్తో, కూస్తా డౌన్ అయ్యి సమావేశంలో రేవంత్ తో ఈ విషయంపై మాట్లాడే అవకాశం ఉంది. దానికి నెగటివ్ గా చిరు ఎదుట రియాక్ట్ అవ్వడం రేవంత్ కు ఇష్టం లేక.. వద్దని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన మర్యాద అలాగే ఉండాలన్న.. గౌరవం కాపాడాలన్నా చిరంజీవిని మీటింగ్ కు పిలవకపోవడమే బెటర్ అని తన పర్సనల్ టీం తో మెగాస్టార్ చిరంజీవికి కాల్ చేయించి మరీ రావద్దని చెప్పాడట రేవంత్ రెడ్డి. ఈ వార్తలో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. జనాలు మాత్రం మెగాస్టార్‌కు ఆయన ఇస్తున్న గౌరవాన్ని చూసి ఫిదా అయిపోతున్నారు. మెగాస్టార్‌ను ఇంతలా గౌరవిస్తున్నందుకు తెగ మురిసిపోతున్నారు. ఇలాంటి సీఎం రాష్ట్రానికి ఉండాలని.. మెగాస్టార్ చిరంజీవి పరువు కాపాడేందుకే ఆయన తీసుకున్న ఈ డెసిషన్ బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇక గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి రేవంత్ రెడ్డి సార్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.