Rice Vs Roti: అన్నం, రొట్టెలు.. ఆరోగ్యానికి ఏది మంచిది? వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలివీ..!

www.mannamweb.com


శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ఆహార నిపుణుల నుండి అందరూ చెబుతారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం మీద స్పృహ పెరిగింది.
ఈ కారణంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సహజంగా డైటింగ్ మెయింటైన్ చేసేవారు అన్నం, రొట్టెల విషయంలో విభిన్న అభిప్రాయాలు కలిగి ఉంటారు. అన్నం కంటే గోధుమలతో చేసిన రొట్టెలు లేదా చపాతీ తినడం ఆరోగ్యానికి మంచిదని కూడా అనుకుంటారు. నిజంగానే రొట్టెలు తినడం ఆరోగ్యానికి మంచిదా? అసలు రొట్టెలు, అన్నం వీటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్? ఆహార నిపుణులు ఈ రెండింటి గురించి ఏమంటున్నారో తెలుసుకుంటే..

ఆరోగ్యానికి ఏది మంచిది?

ఆరోగ్య పరంగా చూస్తే రొట్టెలు అయినా, అన్నం అయినా సమాన కేలరీలు కలిగి ఉంటాయనే షాకింగ్ నిజం బయటపడింది. మధుమేహం ఉన్న వారు కానీ, బరువు తగ్గాలని అనుకునేవారు కానీ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటే తీసుకునే కేలరీల మీద దృష్టి పెట్టాలని ఆహార నిపుణులు అంటున్నారు. ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. కార్భోహైడ్రేట్లు తీసుకుంటే బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతారు. కానీ అసలు ఇది నిజం కాదనే విషయం కూడా ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇక ఆహారం నుండి లభించే శక్తి విషయానికి వస్తే శరీరానికి శక్తి ఇవ్వడంలో కార్బోహైడ్రేట్లు సహాయపడతాయి. ఇవి శరరంలో కొవ్వును జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అందుకే ఆహారంలో 50శాతం సంక్షిష్ట పిండి పదార్థాలు ఉండాలని అంటున్నారు.
అన్నం తింటే తొందరగా కడుపు నిండుతుందా?

బియ్యంలో మంచి మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. మన జీర్ణవ్యవస్థ దానిని జీర్ణం చేయడానికి చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ అన్నంలో రొట్టెల కంటే ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. అందువల్ల అన్నం తింటే తొందరగా కడుపు నిండుతుంది. అయితే రొట్టెలు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనికి కారణం బియ్యంతో పోలిస్తే భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలు రొట్టెలలో ఎక్కువ ఉంటాయి.

రోజులో రొట్టెలు, అన్నం ఎంత తీసుకోవాలి..

రొట్టెలు, అన్నంలలో పోషక విలువలు పెద్దగా తేడా ఉండవు. అయితే తొందరగా బరువు తగ్గాలని అనుకుంటే మాత్రం రోజులో 200గ్రాముల కంటే ఎక్కువ పిండి పదార్థాలను తీసుకోవడం సరైనది కాదు. అయితే మధుమేహం ఉన్నవారు అయితే అన్నానికి బదులు రొట్టెలు తీసుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే వీటిలో సంక్షిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)