ఈ మధ్య సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు సొంత బిజినెస్ లా చేసుకుంటారు. వారికీ బాగా వచ్చిన పనిని వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా ఎంతో మంది లక్షల్లో సంపాదిస్తున్నారు. చదువు రాని వాళ్ళు కూడా పొలం పనులకు సంబంధించిన విడియోలను పెట్టి వేలల్లో వెనకేసుకున్నారు. ఇక మన దేశానికి చెందిన యూట్యూబర్ల ఆస్తులు కోట్లలో ఉంది. వేరెవరో ఇక్కడ తెలుసుకుందాం..
గౌరవ్ చౌదరి
భారత దేశంలో ” గౌరవ్ చౌదరి ” యూట్యూబర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను గురించి ఎవర్ని అడిగిన వెంటనే చెబుతారు. ఆయన హిందీ టెక్ యూట్యూబర్. ఇప్పటివరకు యూట్యూబ్‌లో 25 మిలియన్స్‌కు పైగా సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. ఈయన మొత్తం ఆస్తుల విలువ రూ. 356 కోట్లు. ఇక్కడ కంటే , ఆయన ఎక్కువగా దుబాయ్‌లోనే ఉంటారని తెలుస్తోంది.
భువన్ బామ్
” భువన్ బామ్ ” అత్యంత ధనిక యూట్యూబర్ల లిస్టులో ఇతను కూడా ఒకరు. బీబీ కి వైన్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేటికీ ఎంతో మంది ఫాలో అయ్యేలా చేసుకున్నారు. ఇప్పటివరకు యూట్యూబ్ ద్వారా 122 కోట్లకు పైగానే సంపాదించారు. ఇతను ప్రస్తుతం, కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.
అనిల్ బదానా
అనిల్ బాదానా అనే ఈ యూట్యూబర్ తన సొంత పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు. ఈ ఛానల్‌లో అతను వ్లాగ్స్ చేస్తుంటారు. ఆ వీడియోల ద్వారా రెవిన్యూ వస్తుంది. అలాగే, బయట ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు. ఇతను ఇప్పటి వరకు 80 కోట్లకు పైగా సంపాదించారు.
అజయ్ నాగర్
క్యారీ మినాటి అనే పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మన దేశంలోనే భారీ పాపులారిటీ సంపాదించిన యూట్యూబర్లలో ఇతను కూడా ఒకరు. ఈయన ఎక్కువగా గేమింగ్, కామెడీ వీడియోలను తీస్తుంటారు. ఈయన పూర్తి పేరు అజయ్ నాగర్. యూట్యూబ్ ద్వారా ఇప్పటి వరకు రూ. 50 కోట్లు సంపాదించారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది.