జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వారు తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పటికే పలు నటులు.. వెండి తెరపై కూడా రాణిస్తున్నారు. అయితే.. అలా గుర్తింపు తెచ్చుకున్న ఓ నటి.. భారీ స్కామ్ లో అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఓ జబర్దస్త్ బ్యూటీ ఇరుక్కుందట. ఇంతకీ ఆ నటి ఎవరు? ఇంతకీ ఆమెపై వస్తున్న అంతా పెద్ద ఆరోపణలు ఏంటి ? వివరాల్లోకెళ్తే..
ఆ బ్యూటీ ఎవరో కాదు.. బుల్లితెర నటి, జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాప్యులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరి. అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో తనదైన కామెడీ టైమింగ్ తో మంచి పేరును సంపాదించుకుంది. అంతేకాదు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న రీతు చౌదరి.. పలు వెబ్ సిరీస్ , యూట్యూబ్ వీడియోల్లో కూడా నటించింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి అప్డేట్స్ ఇస్తుంది. అయితే ప్రస్తుతం ఆమె ల్యాండ్ స్కామ్‌లో అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, ఇబ్రహీంపట్నం కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్‌లో రీతు చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ల్యాండ్ స్కాం లో ఈ బ్యూటీ కూడా నిందితురాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. జగన్ సర్కార్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరి పేరు బయటపడింది. విజయవాడ, ఇబ్రహీంపట్నం మధ్య గల ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లో ఒక దొంగల ముఠా ఆస్తిని కొట్టేసినట్లు తెలుస్తోంది.
ఈ ల్యాండ్ మాఫియాల పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎం వైఎస్‌జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లతో పాటు నటి రీతూ చౌదరి, ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నట్టు తెలుస్తోంది. రీతు చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య. అలాగే.. రీతూ చౌదరి అసలు పేరు.. వనం దివ్య గా తెలుస్తోంది.
700 కోట్ల విలువగల భూమిని కొట్టడానికి.. పెద్ద స్కెచ్ వేసినట్లు, ఆ భూ యజమానులను కిడ్నాప్ చేసి గోవాలో బంధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడి సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్.. ఈ ల్యాండ్ స్కాంను బయట పెడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో పలువురుపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో ల్యాండ్ స్కాం జరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
అలాగే జగన్ ప్రభుత్వ హయాంలో ఈ స్కాం జరగడం, ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్ సోదరుడు సునీల్ రెడ్డి, అలాగే అతని పిఏ నాగేశ్వర్ రెడ్డి ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఆరోపణలు నిజా నిజాలు ఏంటో రీతు చౌదరి బయట పెడితేనే అర్థమవుతుంది.. ఈ కేసులో ప్రభుత్వం ఎలా వివరిస్తుందో వేచి చూడాలి. అసలు ఈ విషయంపై రీతూ అధికారికంగా రియాక్ట్ అయ్యే వరకు తెలీదు.. నిజా నిజాలు ఏంటో రీతు చౌదరి ఎప్పుడు బయట పెడుతుందని ఆసక్తి రేకెత్తిస్తుంది.
ఇదిలా ఉంటే రీతూ భర్త శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తమపై వస్తున్న ఆరోపణలలో ఇలాంటి నిజాలు లేవని , కావాలని తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాము మొదటి నుండి టాక్స్ కరెక్ట్ గానే పే చేస్తున్నామని, రీతు వర్మ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తనకు చెందినవేనని, తాము స్వ సంపాదించుకున్నవేనని పేర్కొన్నారు. తాము ఎవరికీ కూడా బినామీ కాదని, తమపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తమని స్పష్టం చేశారు శ్రీకాంత్.