Roasted Chana: రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే.. మీ ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసా?
వేయించిన శనగలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాల నిర్మాణం, మరమ్మత్తు, కణాల పెరుగుదలకు, కండరాల ఆరోగ్యానికి, కండరాలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.
ప్రతిరోజూ గుప్పెడు వేయించిన శనగలు తీసుకుంటే ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
వేయించిన శనగలు పోషకాల పవర్ హౌస్ అంటున్నారు పోషకాహార నిపుణులు. వేయించిన శనగలలో విటమిన్లు, కాల్షియం, ఐరన్, పిండి పదార్థాలు మొదలైనవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.
వేయించిన శనగల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. రోజూ వేయించిన శనగలు తీసుకుంటే.. శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది. ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం ఎంతో అవసరం. వేయించిన శనగలు సమతుల ఆహారంలో ఒక భాగమే అంటున్నారు నిపుణులు. సమతుల ఆహారంలో రోజుకు 100గ్రాముల వరకు వేయించిన శనగలను తీసుకోవచ్చునని చెబుతున్నారు.
వేయించిన శనగల గురించి మరొక షాకింగ్ నిజం ఏమిటంటే వీటిని తినడం వల్ల మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. శనగలలో ఉండే పోషకాలు మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి. వేయించిన శనగల్లో రాగి, ఫాస్పరస్ మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్.. మిమ్మల్ని ఎక్కువకాలం సంతృప్తిగా ఉంచుతుంది. అంతేకాదు, వేయించిన శనగల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు ఆకలి కోరికలు నియంత్రించుకోవాలంటే స్నాక్స్ లో భాగంగా వేయించిన శనగలు తీసుకోవచ్చు. అధిక ఫైబర్ కంటెంట్ గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేయడానికి తోడ్పడుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.