Rose Water | వామ్మో.. రోజ్‌ వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా ?

www.mannamweb.com


Rose Water | రోజ్‌ వాటర్‌ మనకు కొత్తేమీ కాదు. వెయ్యేండ్ల క్రితమే వాడుకలో ఉన్నట్టు దాఖలాలు కనిపిస్తాయి. రోజ్‌ వాటర్‌తో ఎన్నో ప్రయోజనాలు. వాటిలో కొన్ని..
రోజ్‌ వాటర్‌తో సహజమైన ఫేస్‌ ప్యాక్స్‌ తయారుచేసుకోవచ్చు. అలోవెరా జెల్‌ లేదా తేనె కలిపిన రోజ్‌ వాటర్‌ మిశ్రమాన్ని ఓ పది, పదిహేను నిమిషాలు మొహానికి పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం శుభ్రమవ్వడమే కాకుండా కాంతిమంతంగా మారుతుంది.
రోజంతా ఎంత ఒత్తిడి ఉన్నా, సాయంవేళ రోజ్‌ వాటర్‌తో అరోమాథెరపీ చేస్తే… ఉపశమనం తథ్యం. రోజ్‌ వాటర్‌ సువాసన వల్ల మనసుకు హాయిగా అనిపిస్తుంది.
రోజ్‌ వాటర్‌లో వాపును తగ్గించే యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, సూక్ష్మక్రిములను చంపే యాంటీ మైక్రోబియల్‌ గుణాలు అపారం. ఇవి చర్మానికి సోకే ఇన్ఫెక్షన్లు, మొటిమలకు విరుగుడుగా పనిచేస్తాయి.
సూర్యరశ్మి వల్ల కమిలిన చర్మానికి రోజ్‌ వాటర్‌ కొత్త జీవం పోస్తుంది.

మంటను తగ్గించి, చర్మం ఆరోగ్యంగా మారేందుకు సాయపడుతుంది.
చర్మానికి తేమను అందిస్తుంది. ఆ సువాసన మంచి అనుభూతిని కలిగిస్తుంది. చల్లని నీటితో మొహం కడుక్కుని రోజ్‌ వాటర్‌లో ముంచిన దూదితో అద్దుకుంటే, ఎంత ఉపశమనంగా అనిపిస్తుందో.. ఒక్కసారి ప్రయత్నిస్తే మీకే తెలుస్తుంది.