వచ్చేస్తుందొచ్చేస్తుంది రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. అదే కిర్రాక్ లుక్

www.mannamweb.com


రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు ఇండియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ బైక్ ఈవీ సెగ్మెంట్‌లోకి రానుంది. దీంతో ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సహజంగానే అందరిలోనూ నెలకొంది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మొదటి ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ ఆవిష్కరించే సమయం వచ్చేసింది. వాస్తవానికి కంపెనీ తొలిసారిగా తన తేదీని అధికారికంగా వెల్లడించింది. కంపెనీ తన రాబోయే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మొదటి టీజర్‌ను పంచుకుంది. దీనికి సేవ్ ది డేట్‌తో నవంబర్ 4, 2024 తేదీగా ఉంది. ఈ టీజర్‌లో పారాచూట్ సాయంతో ఓ మోటార్ సైకిల్ అంతరిక్షం నుంచి కిందకు వస్తున్నట్లు చూపించారు. కంపెనీ తన ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు కొత్త ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌(@royalenfieldev)ను కూడా ప్రారంభించింది.

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలను కంపెనీ పంచుకోలేదు. అయితే దీని లాంచ్ టైమింగ్ దగ్గరలోనే ఉంది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ లాంచ్ చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. అయితే దీని డిజైన్, ఫీచర్లు, రేంజ్, ధర కూడా మార్కెట్లో దీని భవిష్యత్తును నిర్ణయిస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఓలా మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ కంటే ముందే దీనిని విడుదల చేయబోతోంది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ డిజైన్ ఇప్పటికే లీకైంది. దీని ప్రకారం క్లాసికల్ గా డిజైన్ చేసిన బాబర్ ఫామ్ ఫ్యాక్టర్ ఇందులో కనిపిస్తుంది. దీని ఛాసిస్ డిజైన్ పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది రేక్-అవుట్ ఫ్రంట్ ఎండ్, స్కూప్-అవుట్ సోలో శాడిల్, ఓపెన్, వంగి ఉన్న వెనుక ఫెండర్లను కలిగి ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ ప్రాంతంలోని లూపింగ్ ఫ్రేమ్ ప్రొడక్షన్ మోటార్ సైకిళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది చూడటానికి హార్లే డేవిడ్సన్ క్రూయిజర్ మోటార్ సైకిల్ ను పోలి ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌లో బ్యాటరీ ప్యాక్‌ను ఫ్రేమ్‌గా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. బ్యాటరీ కవర్, మోటార్ రెండింటి చుట్టూ దీనిని అమర్చవచ్చు. ఇది హార్లే డేవిడ్సన్ ఎలక్ట్రిక్ బైక్ తయారీదారు లైవ్వైర్ తన ఎస్ 2 మోడల్‌లో చేసిన మాదిరిగానే ఉంటుంది. బైక్ కుడి వైపున బెల్ట్ డ్రైవ్, రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌లో ప్రధాన ఆకర్షణ ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్, ఇక్కడ గర్డర్ ఫోర్కులను చూడవచ్చు. ఇది ఎలక్ట్రిక్ 01 కాన్సెప్ట్‌లో కనిపించింది. గిర్డర్ ఫోర్క్‌లకు రెండు గర్డర్ చేతులు ఉంటాయి. ఇవి చక్రాన్ని రెండు వైపుల నుండి పట్టుకుంటాయి. టాప్ డాగ్బోన్ బైక్ మెయిన్ ఫ్రేమ్‌కు ఫ్రంట్ ఫోర్క్ అసెంబ్లింగ్‌ను జతచేస్తుంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది సౌండ్. అయితే ఈ ఎలక్ట్రిక్ బైకులో ఎలా వస్తుందా అని అందరికీ ఆసక్తి ఉంది.