ఆకర్షణీయమైన డిజైన్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

www.mannamweb.com


రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బైక్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. తొలి ఎలక్ట్రిక్ బైక్ పేరు- ఫ్లయింగ్ ఫ్లీ FF-C6.. మిలన్‌లో EICMA మోటార్‌సైకిల్ షోలో దీన్ని లాంచ్ చేశారు.

భవిష్యత్తులో వచ్చే అన్ని ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ‘ ఫ్లయింగ్ ఫ్లీ ‘ బ్రాండ్ కింద రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ ఎలక్ట్రిక్ బైక్ C6 ఆధారంగా రూపొందించబడింది. కానీ వాహన తయారీదారులు ఈ బైక్‌లో అనేక కొత్త భాగాలను చేర్చారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీలో కూడా స్టైల్‌ విషయంలో రాజీపడలేదు. ఫ్లయింగ్ ఫ్లీ FF-C6 డిజైన్‌ను ఆకర్షణీయంగా చేసింది. ఈ రెట్రో డిజైన్‌తో బైక్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు రియర్ వ్యూ మిర్రర్‌లను అమర్చారు. దీనితో పాటు, TFT డ్యాష్‌బోర్డ్ కూడా రౌండ్ ఆకారంతో వస్తుంది. ఇందులో ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్తో రానున్నట్లు తెలుస్తోంది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 సీటు ఎత్తు తక్కువగా ఉంటుంది. రైడర్ సౌకర్యవంతంగా ప్రణయాన్ని ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు. మునుముందు రెండు సీట్ల వెర్షన్లు కూడా వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌లో మడ్‌గార్డ్‌ను టైర్ కంటే కొంచెం ఎత్తులో ఉంచారు. దీని ఫ్యూయల్ ట్యాంక్ ఆకారం మునుపటి బైక్ లాగా ఉంది. ఇది టీఎస్టి డిస్ప్లేతో రానుంది.

ఈ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా కొత్త బ్రాండింగ్‌తో భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు భారతీయ బైక్ బ్రాండ్ ధృవీకరించింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 మోడల్ రివీల్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. పూర్తి ఫీచర్ల వివరాలు, ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే అన్ని డీటెయిల్స్ తెలియనున్నాయి. Flying Flea C6 బ్యాటరీ ప్యాక్, రేంజ్ మరియు ఛార్జింగ్ సమయానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా షేర్ చేయలేదు. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బైక్‌తో పాటు స్క్రాంబ్లర్ తరహా ఎఫ్‌ఎఫ్ ఎస్6ని కూడా తీసుకురాబోతున్నారు. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను 2026 ప్రారంభంలోనే విడుదల చేయవచ్చు.