ఐకాన్ స్టార్ అల్లు అర్జున పుష్ప-2 సినిమా విడుదల వేళ హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ విషాదకర ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఇవాళ ఓ వీడియో రూపంలో ఆయన మాట్లాడుతూ.. రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మరణించిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనతో నా హృదయం ద్రవించింది. ఈ విషాదభరిత సమయంలో రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆ కుటుంబం ఒంటరి కాదు.. ఈ బాధాకర సమయంలో నేను ఆమె కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తాను. వారికి అన్ని రకాలుగా సాయం చేస్తాను’ అని అల్లు అర్జున్ చెప్పారు.