టిడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే.. ఏప్రిల్ నుంచే రూ.4వేల పింఛన్ అమల చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధర్మవరం సభలో ప్రకటించారు.
దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచుతామని.. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24వేలు ఇస్తామన్నారు. పింఛన్ కోసం జగన్ వృద్ధులను పొట్టన పెట్టుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీ సూచించినా.. మండుటెండలో సచివాలయానికి రావాలని ఇబ్బందిపెట్టారు. శవ రాజకీయాలు చేసే సీఎంను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జగన్ కి ముందే తెలుసు అన్నారు చంద్రబాబు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా చేశారు. ఇప్పుడేమో గులకరాయి దాడి నాటకాలు ఆడుతున్నారు. ఓటమి ఖాయమని తెలిసి.. కొత్త నాటకాలు మొదలుపెట్టారు. మూడు రాజధానుల పేరుతో జగన్ అసలు రాజధాని లేకుండా చేశారు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి ప్రజలను తీసుకొచ్చారు. అమరావతిని దేశంలోనే నెం.1 గా చేస్తామన్నారు.