మలేసియా.. ఈ దేశంలోని కౌలాలంపూర్, లాంగ్ కావి వంటి నగరాలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా పేరుగడించాయి. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు అర్బన్ అట్రాక్షన్స్ చాలానే ఉంటాయి.
ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి.
శ్రీలంక.. మన దేశం నుంచి అతి తక్కువ ఖర్చుతో వెళ్లి రాగలిగే మరో సుందర ప్రాంతం శ్రీలంక. ఇక్కడి అందమైన సముద్ర తీరాలు, బీచ్ లు ఆకర్షిస్తాయి. అక్కడి కల్చర్, హెరిటేజ్ కట్టడాలు, వైల్డ్ లైఫ్ అనుభవాలు మీకు విశేషానుభూతిని అందిస్తాయి.
బాలి, ఇండోనేషియా.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు బాలి. ఇక్కడి పచ్చందాలు, బీచ్ వ్యూలు ఆకర్షిస్తాయి. అలాగే దేవాలయాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఆహారం, వసతి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇది తప్పని సరిగా మీకు మంచి అనుభూతిని అందివ్వడంతో పాటు మీ వకేషన్ ను ఆనందమయంగా చేస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు.
థాయ్‌ల్యాండ్ .. ఇది మన దేశీయ ట్రావెలర్స్ కు బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇక్కడి నైట్ లైఫ్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. అలాగే బీచ్ అందాలు, కల్చరల్ ఫీస్ట్ లు ఆకట్టుకుంటాయి. థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్, ఫుకెట్, పట్టాయా నగరాలను అతి తక్కువ ధరలోనే చుట్టేసి రావొచ్చు.
నేపాల్.. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం. నేపాల్ ట్రెక్కింగ్ కు ప్రసిద్ది గాంచింది. ఇక్కడ దేవాలయాలు, మౌంటేన్ వ్యూస్ అబ్బురపరుస్తాయి. ముఖ్యంగా హిమాలయాల అందాలు ఆకర్షిస్తాయి.