500 Gas Cylinder Scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరో గ్యారంటీ అమలుకు రెడీ అయ్యింది. మహాలక్ష్మి పథకంలో (Mahalakshmi)భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్(500 Gas Cylinder) అందించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రేషన్ కార్డుదారులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వీటిలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వైట్ రేషన్‌కార్డుదారులకు(Ration Cards) రూ.500కే సిలిండర్ ఇవ్వనున్నట్లు జీవోలో ప్రకటించారు. ఈ మేరకు రూ.500కే గ్యాస్ పథకానికి సంబంధించి విధివిధానాలు ప్రభుత్వం విడుదల చేసింది.
గ్యాస్ సిలిండర్ స్కీమ్ గైడ్ లైన్స్
సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందించేందుకు మూడు విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. రూ.500కే గ్యాస్ సిలిండర్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు ఆధారంగా 39.5 లక్షల మందిని లబ్ధిదారులను గుర్తించింది. గత మూడేళ్లుగా గ్యాస్ సిలిండర్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని దాని సరాసరి ఆధారంగా ఏడాది ఎన్ని సబ్సిడీ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయిస్తారు. అయితే వినియోగదారులు గ్యాస్ లిండర్ మొత్తం నగదును చెల్లించి తీసుకోవాలి. అనంతరం వినియోగదారుల ఖాతాలోకి సబ్సిడీ నగదును జమ చేయనున్నారు. గ్యాస్ సబ్సిడీని(Gas Subsidy) నేరుగా ఆయిల్ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఆయిల్ సంస్థల నేరుగా వినియోగదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుంది. ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్లు మానిటరింగ్ చేయనున్నారు. భవిష్యత్తులో లబ్దిదారులకే రూ. 500 చెల్లించేలా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సిలిండర్ కొనుగోలు చేసిన 48 గంటల్లోనే లబ్దిదారుల ఖాతాల్లో సబ్సిడీ డిపాజిట్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
లబ్దిదారుల ఎంపిక
రూ.500లకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు పథకం వర్తించదని అధికారులు తెలిపారు. పాత కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న వారికే గ్యాస్ సబ్సిడీ(Gas Subsidy) అమలు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకంలో రూ.500 గ్యాస్ సిలిండర్ లబ్దిదారులను ఎంపికకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ప్రజాపాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిని ఆశావర్కర్ల సాయంతో లబ్దిదారులను ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఆశా కార్యకర్తలు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి రేషన్ కార్డుతోపాటు ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ పథానికి అర్హులైనవారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. అయితే తెల్లరేషన్ కార్డు కలిగి, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. తెలంగాణలో సుమారు 90 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది. వీటిలో 64 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రస్తుతానికి రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కానున్నారు. మిగిలిన 26 లక్షల తెల్లరేషన్ కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేకపోవడం..వారికి ఈ పథకం వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 26 లక్షల మంది కొత్త గ్యాస్ కలెక్షన్ తీసుకుంటే ఈ పథకం వర్తించస్తుంది.