మీరు బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్ కొనాలి అనే ప్లాన్‌లో ఉంటే.. ఇది మీకు బాగా నచ్చుతుంది. దీని ఫీచర్స్ బాగున్నాయి. ఆఫర్ బాగుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొని, కొనాలో వద్దో నిర్ణయం తీసుకోవచ్చు.
ఇది AIR ఫాల్కన్ సిరీస్ నోట్‌బుక్ / ల్యాప్‌టాప్. ఇది ఇంటెల్ i3 కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12TH జనరేషన్ 8 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ స్పేస్ (SSD) కలిగివుంది. ఇది విండోస్ 11 వెర్షన్‌తో పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌తో 65W టైప్ సీ అడాప్టర్ ఇస్తున్నారు.
ఇది ఎంట్రీ లెవెల్ ల్యాప్‌టాప్, విద్యార్థులకు, స్టడీ పర్పస్ కోసం పనిచేస్తుంది. భారీ గేమ్స్ ఆడేందుకు మాత్రం ఇది పనిచెయ్యదు. దీని కెపాసిటీ చిన్న చిన్న పనులకు పనిచేస్తుంది. దీని స్క్రీన్ సైజ్ 14.1 అంగుళాలు ఉంటుంది. ఇందులో గ్రాఫిక్ కార్డు ఉంది. దీనికి ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉంది. ఇది సన్నగా, బరువు 1.48 కేజీలే ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌కి FHD IPS స్క్రీన్ ఉంది. ఇది కళ్లకు హాని కలగకుండా.. స్పష్టమైన, కాంతివంతమైన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీకి 10 గంటల లైఫ్ ఉంటుంది. దీనికి 4000mAh బ్యాటరీ ఉంది.
ఈ ల్యాప్‌టాప్‌ని మహారాష్ట్రలోని ముంబైలో తయారుచేస్తున్నారు. ఇది Sapphire Sea కలర్‌లో ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ 1920 x 1080 pixel ఉంటుంది. ప్రాసెసర్ స్పీడ్ 4.4 GHz ఉంటుంది. మాగ్జిమం మెమరీ సపోర్ట్ 32 GB ఉంటుంది. దీనికి USB 2.0 పోర్ట్ 1 ఉండగా.. USB 3.0 పోర్టులు 2 ఉన్నాయి. ఫ్రంట్ వెబ్‌కామ్ రిజల్యూషన్ 1 ఎంపీ ఉంది.
ఈ ల్యాప్ టాప్ ఆసలు ధర రూ.54,990 కాగా.. అమెజాన్‌లో దీనిపై 53 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.25,890కి అమ్ముతున్నారు. ఐతే.. పాత ల్యాప్‌టాప్ ఉంటే.. ఎక్స్‌చేంజ్ కింద రూ.11,200 పొందవచ్చు. అలాగే.. కొన్ని రకాల క్రెడిట్ కార్డుల ద్వారా కొంటే మరో రూ.1,500 తక్కువకి పొందవచ్చు. ఇంకా EMIలో రూ.1,255కి సొంతం చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌లో సేకరించిన సమాచారం మాత్రమే.