వీడబ్ల్యూ 32 ఇంచెస్‌తో లైనక్స్ సిరీస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 16,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 56 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని కేవలం రూ.
7499కే సొంతం చేసుకోవచ్చు
అయితే ఈ డిస్కౌంట్స్ ఇక్కడితో ఆగలేవు. అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 220 వరకు క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ టీవీని నెలకు రూ. 367 చెల్లించి కూడా ఈఎమ్‌ఐ ఆప్షన్‌తో సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీలో 32 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఈ టీవీతో 18 నెలల వారంటీని అందించారు. అలాగే ఇందులో 720 పిక్సెల్స్ రిజల్యూషన్ స్క్రీన్‌ను ఇచ్చారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.
ఇక ఈ టీవీలో వైఫై, యూఎస్‌బీ, ఈథర్ నెట్, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఈ టీవీ మిరకాస్ట్‌తో పాటు ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లైవ్, యప్ టీవీతో పాటు మరెన్నో యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఇక ఈ టీవీలో ఐపీఈ టెక్నాలజీని అందించారు. అలాగే ఎకో విజన్, మోడ్, జూమ్ వంటి ఫీచర్లను ఇచ్చారు. ఈ టీవీ స్క్రీన్ 16.7 మిలియన్ కలర్స్‌కు సపోర్ట్ చేస్తుంది.