అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లూ మంచిగా ఉండవు. ఒక్కోసారి బ్రాండెడ్ స్కూటర్లు కూడా రిపేర్లతో ఇబ్బంది పెడతాయి. అలాంటిది ఒక స్కూటర్ మాత్రం కస్టమర్లకు బాగా నచ్చుతోంది. రివ్యూల్లో మెచ్చుకుంటున్నారు. దాని ధర, మైలేజ్, ఖర్చులు, ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
ఈ స్కూటర్‌కి గురించి చెప్పుకునే ముందు.. ఇందులో కొన్ని పాజిటివ్ అంశాలు చెప్పుకుందాం. దీనికి ఉన్న బ్యాటరీని బయటకు తియ్యవచ్చు. అందువల్ల సెల్లార్ లోనే కాకుండా.. ఇంట్లో కూడా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్కూటర్ లుక్ బాగుంది. తక్కువ ధరకు ఇంత అందమైన స్కూటీ రావడం కష్టం. అలాగే.. ఇది 11 కలర్స్‌లో లభిస్తోంది. అందువల్ల నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు. కలర్ ఫినిషింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ ఉండటంతోపాటూ.. బ్యాటరీకి ఇచ్చిన గ్యారెంటీ కూడా ఈ స్కూటీని కొనుక్కునేలా చేస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం.
ఇది AMO కంపెనీ తయారుచేసిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సింగిల్ లైట్ స్కూటీ. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. అందువల్ల దీన్ని నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. అలాగే.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు. తద్వారా ఓ 10వేల రూపాయలు సేవ్ అయినట్లే. అలాగే.. ఈ స్కూటర్ బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేసినప్పుడు ఇది 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఛార్జింగ్ కోసం పోర్టబుల్ ఛార్జర్ ఇస్తున్నారు.
ఈ స్కూటర్‌కి వారంటీ బాగుంది. మోటర్, కంట్రోలర్, ఛాసిస్‌కి 12 నెలల వారంటీ ఇచ్చారు. అలాగే.. బ్యాటరీకి కూడా 12 నెలల వారంటీ ఇవ్వడం గొప్ప విషయం. అందులోనూ బ్యాటరీ సమస్య వస్తే.. పూర్తిగా కొత్త బ్యాటరీ ఇస్తారు. ఇది మంచి ఆఫర్. చాలా స్కూటర్లకు బ్యాటరీపై వారంటీ 6 నెలలే ఇస్తున్నారు. రివ్యూలలో కూడా.. బ్యాటరీ బ్యాకప్ బాగుందని కస్టమర్లు చెబుతున్నారు.
ఈ స్కూటర్‌కి సేఫ్టీ ఫీచర్లుగా హాజార్డ్ స్విచ్ ఉంది. ఏదైనా ఆపదలో ఇది కాపాడుతుంది. అలాగే.. స్కూటర్ ఎవరూ చోరీ చెయ్యకుండా.. యాంటీ థెఫ్ట్ అలారం ఉంది. స్కూటర్‌ని ఎవరైనా కదిపితే.. మీ మొబైల్‌కి యాప్ ద్వారా అలర్ట్ వస్తుంది. దాంతో మీరు దొంగను పట్టుకోవచ్చు. రోడ్లపై గతుకుల్లో ఇబ్బంది లేకుండా.. ఫ్రంట్ సస్పెన్షన్ కోసం టెలిస్కోపిక్ ఫోర్క్ ఇచ్చారు. వెనక స్ప్రింగ్ లోడెడ్ గ్యాస్ ఇచ్చారు. అందువల్ల గతుకుల రోడ్లపై కూడా సేఫ్‌గా వెళ్లే వీలు ఉంది.
ఈ స్కూటర్‌కి 249 W పవర్ మోటర్ ఉంది. అది BLDC మోటర్ కావడం మంచి అంశం. ఈ రోజుల్లో పవర్‌ఫుల్ మోటర్‌గా BLDC ఉంటోంది. ఇది ఖరీదైనది. అందుకే చాలా స్కూటర్లలో ఈ మోటర్ వాడరు. ఈ స్కూటర్‌కి ముందువైపు డిస్క్ బ్రేక్, వెనకవైపు డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అది ప్లస్ పాయింట్. ఎందుకంటే.. మనం కంగారులో ఫ్రంట్ బ్రేక్ వేస్తే.. డిస్క్ బ్రేక్ కావడం వల్ల బండి స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. వేగం తక్కువే కాబట్టి.. వెనకవైపు డ్రమ్ బ్రేక్ సరిపోతుంది.
డిస్‌ప్లేకి సంబంధించి స్పీడోమీటర్ ఇచ్చారు. అలాగే టైర్లు ట్యూబ్‌లెస్ ఇచ్చారు. అందువల్ల ఎప్పుడైనా ప్యాచ్ పడినా.. బండి ఆగిపోదు. రిపేర్ చేసేవారి దగ్గరకు డ్రైవ్ చేస్తూ వెళ్లిపోవచ్చు. హెడ్‌లైట్స్ రెండూ కూడా LEDవి ఇచ్చారు. వెనకవైపు బల్బ్ ఇచ్చారు. ఇండికేటర్లకు కూడా బల్బ్ ఉంది. పగటిపూట కూడా లైట్స్ ఆన్‌లోనే ఉంటాయి. అలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రూల్ తెచ్చింది. ఆ రూల్ ఈ కంపెనీ పాటిస్తోంది.
ఈ స్కూటర్ అసలు ధర రూ.70,000 కాగా.. అమెజాన్‌లో దీనిపై 46 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. అందువల్ల ఇది మీకు రూ.37,999కే లభిస్తుంది. అలాగే.. బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్లు అప్లై చేసుకుంటే మరో రూ.3,000 తగ్గుతుంది. అలాగే.. అమెజాన్ పే బ్యాలెన్స్ అప్లై చేసుకుంటే.. రూ.1,139 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలా ఈ స్కూటర్ మీకు రూ.33,860కే లభించగలదు. మీరు EMI ఆప్షన్‌లో రూ.1,842 చెల్లించి దీన్ని పొందవచ్చు.
ఈ స్కూటీ సన్నగా ఉంటుంది. బరువు 80 కేజీలే ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ తక్కువగా ఉన్న చోట కూడా దీన్ని ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా ఉండటం వల్ల మైలేజ్ ఎక్కువగా రావడంతోపాటూ.. ఛార్జింగ్ ఎక్కువగా వాడుకోదు. తద్వారా ఖర్చులు బాగా తగ్గుతాయి. పెట్రోల్ స్కూటీలతో పోల్చితే.. దీని ద్వారా నెలకు సుమారు రూ.1,000 దాకా ఆదా చేసుకోవచ్చు. ఐతే.. సీటు కింద స్టోరేజ్ స్పేస్ ఎంత ఉంది? బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఎంత టైమ్ పడుతోంది వంటి వివరాలు అమెజాన్ ఇవ్వలేదు.
రివ్యూల ప్రకారం ఈ స్కూటర్‌కి అత్యధికంగా 4.5/5 రేటింగ్ ఉంది. ఎక్కువ మంది ఈ స్కూటర్ తక్కువ ధరలో లభిస్తుండటాన్ని మెచ్చుకున్నారు. ఈ స్కూటీ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని ఒక యూజర్ చెప్పారు. ఇది బాగుందనీ, బ్యాటరీ బ్యాకప్ బాగుందని మరో యూజర్ చెప్పారు. లుక్ బాగుందనీ, స్మూత్‌గా వెళ్తోందనీ.. రివర్స్ గేర్ ఫీచర్స్ కూడా బాగున్నాయనీ, త్వరగా డెలివరీ చేశారనీ, ప్యాకింగ్ కూడా బాగా చేశారని మరో యూజర్ తెలిపారు. ఈ ప్రొడక్ట్ కొనమనీ ఇతరులకు చెబుతాననీ, కలర్ బాగుందనీ, సెక్యూరిటీ ఫీచర్లు కూడా బాగున్నాయని మరో యూజర్ తెలిపారు.
ఓ కస్టమర్ ఏం చెప్పారంటే.. “ఈ స్కూటర్ బాగుంది. మూడు రోజులుగా దీన్ని నడుపుతున్నాను, చాలా మంచి స్కూటర్. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. కానీ బ్యాటరీ ఫిట్టింగ్‌లో కొంచెం మెరుగుదల అవసరం ఉంది, ఎందుకంటే శబ్దం వస్తోంది. స్కప్ కూడా కొంచెం లూజ్‌గా ఉంది. డెలివరీ సమయంలో మీ స్కూటీ అన్ని పార్ట్స్‌నూ బాగా చెక్ చేయండి, ఏదైనా పగిలిన లేదా దెబ్బతిన్న భాగాలు ఉండే అవకాశం ఉంది” అని రివ్యూ ఇచ్చారు.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. మీరు ఈ స్కూటర్ కొనాలి అనుకుంటే.. ముందుగా అన్ని రివ్యూలూ, కస్టమర్లు పోస్ట్ చేసిన ఫొటోలను కూడా చూడండి. అలాగే.. కంపెనీ ప్రతినిధులు, అమెజాన్ ప్రతినిధులతో మాట్లాడండి. అన్ని డౌట్లూ క్లారిఫై చేయించుకొని, కొనాలో వద్దో ఫైనల్ నిర్ణయం స్వయంగా తీసుకోండి.






























