రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం

www.mannamweb.com


మీరు తక్కువ పెట్టుబడితో(investments) ఇంటి వద్దనే ఉంటూ మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే వ్యాపారాన్ని(Business) ఇంటివద్దనే ఉంటూ సులభంగా ప్రారంభించవచ్చు. దీనికి పెద్దగా నైపుణ్యాలు కూడా అవసరం లేదు. మహిళలు కూడా దీనిని ప్రారంభించవచ్చు. అదే పత్తి వత్తుల(cotton wicks) బిజినెస్. వీటికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో పూజల కోసం దీపాలలో వెలిగించేందుకు పత్తి వత్తులను ఉపయోగిస్తారు. కాబట్టి ప్రతి వారం, నెలకోసారి, పూజలు, వ్రతాల సమయంలో వీటిని అనేక మంది ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ వ్యాపారం కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత లాభం వస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్థలం కూడా అవసరం లేదు

ఈ బిజినెస్(Business) ప్రారంభించాలంటే ప్రత్యేకంగా స్థలం కూడా అవసరం లేదు. మీరు ఉన్న ప్రాంతంల గ్రామం లేదా పట్టణాల్లో కూడా దీనిని ప్రారంభించుకోవచ్చు. ఈ పత్తి వత్తుల వ్యాపారానికి ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది. అయితే చాలా మంది కాటన్ వత్తులను తయారు చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో వీటిని తయారు చేసేందుకు మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాటన్ విక్ తయారీ యంత్రం ప్రస్తుతం మార్కెట్లో 12 వేల రూపాయలకు అందుబాటులో ఉంది. మీరు ఈ యంత్రాన్ని మార్కెట్ నుంచి సులభంగా పొందవచ్చు. ఆ తర్వాత మీరు నాణ్యమైన పత్తిని రైతులు లేదా వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాలి.

మీ బడ్జెట్‌ను బట్టి

ఈ యంత్రంతో మీరు ఇంట్లో కూర్చొని పత్తి వత్తులను తయారు చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ బడ్జెట్‌ను బట్టి మాన్యువల్ విధానంలో కూడా వత్తులను చేసుకోవచ్చు. ఒక వేళ మీరే పత్తి పంటను పండిస్తే మీకు మరింత ఖర్చు మిగులుతుంది. ఈ వ్యాపారంలో మీరు 50% వరకు లాభం పొందవచ్చు. ఒక కిలో ముడి పత్తి నుంచి 14 నుంచి 15 వేల వరకు వత్తులను తయారు చేసుకోవచ్చు. రోజుకు కనీసం రెండు వందల ప్యాకెట్ల వత్తులను (ప్యాకెట్లో 15 వత్తులు) తయారు చేసినా కూడా నెలకు 6000కుపైగా ప్యాకెట్లు సిద్ధమవుతాయి.

ఆదాయం ఎంత

పత్తి వత్తుల ప్యాకెట్ ధర మార్కెట్లో రూ. 10 నుంచి రూ.20 ఉంటుంది. ఈ క్రమంలో వాటిని సమీపంలోని షాపులకు అందిస్తే 6000 ప్యాకెట్లకు 10 రూపాయల లాభం వేసుకుంటే నెలకు 60 వేల రూపాయలు సంపాదించవచ్చు. అయితే మీరు చేసే వత్తుల ఉత్పత్తిని బట్టి మీ ఆదాయం ఉంటుంది. ఈ వత్తులను ఎక్కువగా తయారు చేసి మరిన్ని ఎక్కువ షాపుల్లో సేల్ చేస్తే మరింత ఎక్కువ లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటికి ఎల్లప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. పాడవుతాయనే ఇబ్బంది ఉండదు. అనేక మంది వారి ఇళ్లల్లో పూజకు తప్పనిసరిగా పత్తి వత్తులను ఉపయోగిస్తారు. దీంతో వీటికి ఆల్ టైమ్ మార్కెట్ ఉంటుంది.