ఆల్ టైమ్ రికార్డ్.. రూ. లక్షా 10 వేలు దాటిన తులం గోల్డ్ ధర.. నేడు రూ. 1360 పెరిగింది..

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. రూ. లక్షా 10 వేలు దాటింది తులం గోల్డ్ ధర. ఇవాళ ఒక్క రోజే రూ. 1360 పెరిగింది. సిల్వర్ ధరలు కూడా భగ్గుమన్నాయి.


కిలో వెండిపై రూ. 3000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,029, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,110 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1250 పెరిగింది. దీంతో రూ.1,01,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1360 పెరిగింది. దీంతో రూ. 1,10,290 వద్ద ట్రేడ్ అవుతోంది.

విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,440 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,40,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.