శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తారు. గ్రూపులుగా వెళ్లే అయ్యప్ప భక్తులకు అతి తక్కువ ధరకే అద్దె బస్సులు సమకూర్చాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ప్రత్యేక సౌకర్యాలను కల్పించనుంది. అదే విధంగా ప్రత్యేకంగా ఉచిత ప్రయాణం ఎవరికి కల్పించేదీ వెల్లడించింది. ఈ బస్సుల పైన ఆర్టీసీ పూర్తి సమాచారం ప్రకటించింది.
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన బస్సులను కేటాయించింది. ఈ మేరకు అధికారులు కీలక ప్రకటన చేసారు. ఈ బస్సులకు భక్తుల ప్రయాణ టూర్ ప్లాన్ కు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆర్టీవో పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, అల్ట్రాడీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉంచారు. శబరిమలకు వెళ్లే స్వామి అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ నలు మూల ల నుంచి ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 200 బస్సులను నడపాలని నిర్ణయించింది. సుమారు లక్ష మంది భక్తులకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ లక్ష్యంగా డిసైడ్ చేస్తూ.. ప్రతీ డిపోకు రెండు బస్సులు కేటాయించింది.
ఈ ప్రత్యేక బస్సులకు ప్యాకేజీలను ఖరారు చేసింది. ప్రయాణ దూరాన్ని బట్టి కిలోమీటరుకు ఛార్జీలు నిర్దారించింది. అదనంగా, బస్సుల వెయిటింగ్ సమయానికి గంటకు రూ.300 చొప్పున వెయిటింగ్ ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది.ని ఆర్టీసీ స్పష్టం చేసింది. సూపర్ లగ్జరీ బస్సులో రాను ను దూరం 3,000 కి.మీ.. ఆరు రోజుల ప్రయాణం కోసం అన్ని ఖర్చులు కలిపి రూ .1,97,962 అవుతుంది. గురుస్వామి పేరుతో బస్సు బుక్ చేసుకుంటే.. ఒక యాత్రికుడి ఛార్జి అంటే సుమారు రూ.5,498 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, అదనంగా రూ.10 వేల కాషన్ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. యాత్ర పూర్తయిన తర్వాత భక్తులకు తిరిగి చెల్లిస్తారు. కాగా, రాజధాని బస్సుల్లో 40 సీట్లు ఉంటుండగా.. కి.మీకు రూ.77 వసూలు చేయనున్నారు.
కాగా, సూపర్ లగ్జరీ బస్సుల్లో 36 సీట్లకు కి.మీకు రూ.59 వసూలు చేయనున్నారు. డీలక్స్ 40 సీట్లకు కి.మీకు రూ.57, ఎక్స్‌ప్రెస్ 50 సీట్లకు కి.మీ రూ.62 వసూలు చేస్తారు. ఈ బస్సుల్లో గురుస్వామికి ఉచితం ప్రయాణించే అవకాశం కల్పించారు. అలాగే, భక్తులతో పాటు వచ్చే లగేజ్ అటెండెంట్లు, వంట మాస్టర్లకు కూడా సీట్లు కేటాయించకుండా ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తారు.
































