నిరుద్యోగులకు RTC గుడ్ న్యూస్.. మీ లైఫ్ సెట్ చేసుకునే ఛాన్స్.. మిస్ చేసుకోకండి

www.mannamweb.com


ప్రస్తుత రోజుల్లో చదువు పూర్తైన వెంటనే జాబ్ కోసం వెతికే వారే ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ, ఈరోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం గగనమైపోయింది. మంచి శాలరీతో కూడిన జాబ్స్ కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు స్పెషల్ స్కిల్స్ కూడా ఉండి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో కొందరు స్వయం ఉపాధి మార్గాలపై దృష్టిసారిస్తున్నారు. ఏదైనా ట్రైనింగ్ తీసుకుని త్వరగా ఉపాధి కల్పించే రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారు. ఇలా ట్రైనింగ్ తీసుకుని స్కిల్స్ నేర్చుకుని పలు విభాగాల్లో స్థిరపడాలి అని అనుకునే వారికి ఇదే సరైన అవకాశం. మరి మీరు కూడా తక్కువ సమయంలోనే లైఫ్ లో స్థిరపడాలని భావిస్తే ఈ అవకాశాన్ని వదులుకోకండి. తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది.

మీరు టెన్త్, ఎనిమిదో తరగతి పూర్తి చేసి ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు రెడీ అయ్యింది. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వొచ్చు. టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్‌ హకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను కోరుతోంది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ తాజాగా 5వ దఫా వాక్ ఇన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. మెకానికల్ డీజిల్, మెకానిక్ (మోటార్ వెహికల్), వెల్డర్, పెయింటర్ వంటి కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తోంది.

డీజిల్ మెకానిక్, వెల్డర్‌ కోర్సుకు ఏడాది, మెకానిక్ మోటార్ వెహికల్, పెయింటర్‌కు అయితే రెండేళ్లు కోర్సు కాల వ్యవధి ఉంటుంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్​షిప్​ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తోంది. అనుభవం కలిగిన ఆర్టీసీ అధికారులు, నిపుణులతో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 28 తేదీలోపు https://iti.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఈ ఐటీఐ కోర్సులు ఒక వరం.