మహిళలకు ఆర్టీసీ శుభవార్త ఉమెన్స్ డే సందర్భంగా జీవో జారీ చేసింది.

ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనుంది. అనంతరం మిగిలిన మండల సమాఖ్యలకు 450 బస్సులను కేటాయించనుంది. ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ.77,220 చొప్పున అద్దె చెల్లించనుంది. కాగా బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.