రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. రైతు భరోసా పథకానికి ప్రభుత్వం మరిన్ని నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు మూడు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగిందని, అయితే సాంకేతిక సమస్యల కారణంగా కొందరు అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు ఇంకా పడలేదని అధికారులు వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలుస్తోంది. ఈ పథకం ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఎంతో సహాయపడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రైతు భరోసా కోసం రూ. 18 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండటం వల్ల రైతుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అయితే ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనితో త్వరలో మిగిలిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
Also Read
Education
More