సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం నజర్..సజ్జల భార్గ‌వ్‌కు షాకిచ్చిన పోలీసులు

www.mannamweb.com


సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సజ్జల భార్గ‌వ్‌‌పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కడప జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ పై అట్రాసిటీ కేసు నమోదైంది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన సింహాద్రి పురంలోని హరి అనే వ్యక్తి అట్రాసిటీ కేసును పెట్టాలని పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే సజ్జల భార్గవ్‌తోపాటు అర్జున్ రెడ్డి, రవీంద్రారెడ్డిపై కూడా కేసు నమోదైంది. హరి అనే వ్యక్తి తనను ఈ ముగ్గురు కులం పేరుతో దూషించారని కేసు పెట్టాడు. హరి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇప్పటికే వర్రా రవీంద్ర పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌పై కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే వర్రా రవీంద్ర పోలీసుల అదుపులో ఉన్నాడు.

కడప జిల్లాలో సోషల్ మీడియా యాక్టివిస్టు వార్రా రవీంద్ర అరెస్ట్ తర్వాత పరిస్థితులు చాలా సీరియస్‌గా ఉన్నాయి. వర్రా రవీంద్ర అరెస్టుపై పోలీసులు కొంత అలసత్వం ప్రదర్శించరాని కూటమి ప్రభుత్వం విమర్శలు చేసింది. అయితే అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా కూటమి ప్రభుత్వంపై తమ విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై స్పందించి ప్రభుత్వం కావాలనే కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని వారు మండిపడ్డారు.

అంతే కాకుండా అరెస్ట్ చేసిన వారిని సకాలంలో కోర్టుకు తీసుకువెళ్లడం లేదని వర్రా రవీంద్రను కర్నూలు డీటీసీలో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి బాహాటంగానే విమర్శించారు. అంతే కాకుండా ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి ఇంటిదగ్గర కూడా పోలీసులు హల్చల్ చేశారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో రాఘవరెడ్డిని విచారణకు తీసుకువెళ్లేందుకు పోలీసులు సిద్ధమయ్యారు వర్రా రవీంద్ర కేసు విషయంలో రాఘవరెడ్డి వాట్సాప్ చాటింగ్ ఏదో పోలీసుల దగ్గర బహిర్గతమైనట్లు తెలుస్తోంది.