Sajjala Ramakrishna Reddy: సజ్జల’ చుట్టూ ఉచ్చు బిగుస్తోందిలా

Sajjala Ramakrishna Reddy: వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరించారు సజ్జల భార్గవ్ రెడ్డి. వైసిపి ప్రభుత్వానికి, పార్టీకి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించారు తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఎంట్రీ తో వైసీపీలో సీన్ మారింది. జగన్ వెంట ఉండే కీలక నాయకులంతా వెనక్కి వెళ్లిపోయారు. అందరికంటే ముందుకు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా క్రియాశీలకంగా మారారు ఆయన. అటు వైసీపీలో కీలకమైన సోషల్ మీడియా విభాగాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డి హ్యాండిల్ చేయడం ప్రారంభించారు. ప్రత్యర్థులను వెంటాడి వేటాడి సోషల్ మీడియాలో వేధించడం పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు భార్గవ రెడ్డి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారికి.. అప్పటి ప్రభుత్వం నుంచి జీతాలు వెళ్లాయి అన్నది ఇప్పుడు వస్తున్న ఆరోపణ. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేసిన విషయం తాజాగా బయటపడింది. దీనిపై విచారణ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో అవుట్సోర్సింగ్ పేరిట వేలకోట్ల చెల్లింపులు చేశారు. వీరంతా వైసిపి కోసం పనిచేశారు. పైకి మాత్రం కార్పొరేషన్. చేసిందంతా మాత్రం దోపిడీనే. ప్రజల సొమ్ముతో సోషల్ మీడియాలో వైసిపి ప్రచారం చేసిందని తేలింది.

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో శాఖలో జరిగిన అవినీతి బయటపడుతోంది. అందులో భాగంగా సమాచార శాఖలో బయటకొస్తున్న స్కాం మూలాలు సంచలనం సృష్టిస్తున్నాయి. విచారణ జరపాలంటూ మంత్రులకు టిడిపి నేతలు ఫిర్యాదు చేయడంతో.. త్వరలో కేసులు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశేషమేమిటంటే.. జడ్జిలపై తప్పుడు వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన వారికి కూడా లక్షల్లో జీతాలు చెల్లించినట్లు బయటపడింది. బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా వారికి పెద్ద ఎత్తున జీతాలు చెల్లించేవారని తేలింది. ఇటీవల టిడిపి నేతలు దాడి చేశారని ఆరోపణలు చేసిన పాలేటి రాజ్ కుమార్, ఆయన భార్యకు కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వైసిపి సోషల్ మీడియాను హ్యాండిల్ చేసింది సజ్జల భార్గవ్ రెడ్డి. అందులో పని చేస్తున్న వారికి డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించేది. అందుకే ఈ కేసు ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి మెడకు చుట్టుకుంది. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఎక్కడ ఉన్నా విడిచి పెట్టే ఛాన్స్ లేదు. తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటే భార్గవ రెడ్డి పై సైతం ఉక్కు పాదం మోపి అవకాశం ఉంది. వీరిపై మున్ముందు కేసులు పెరిగే అవకాశం ఉందని.. అన్నింటికీ ఈ తండ్రీ కొడుకులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.