తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎస్‌డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) లోగోని, సంబంధిత వాహనాలను, బోట్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే. ఈ సందర్బంగా వారికి ఒక శుభ వార్త చెబుతున్నాం. హోమ్ గార్డుల రోజు వేతనాన్ని రూ.921 నుంచి రూ.1000కి, వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ప్రమాదంలో మరణించినా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తూ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని అన్నారు. కాగా, హెంగార్డులకు పెంచిన జీతాలు, ఇతర సదుపాయాలు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి.