శాసన మండలిలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ‘తల్లికి వందనం’ పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున సాయం అందిస్తున్నామని తెలిపారు.
ఇంకా అర్హులుంటే తప్పకుండా వర్తింపజేస్తామన్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారికి వెరిఫికేషన్ అనంతరం నగదు జమ చేస్తామన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు.
ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయి. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా?
మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం..చెయ్యనివ్వం. జగన్ రెడ్డి గారూ కడుపు మంటగా ఉన్నట్టుంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుద్ది’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
































