తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అత్యున్నత స్థాయి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదల చేశారు.
గ్రూప్ 1 ఫలితాలలో, రామన్నపేట పట్టణానికి చెందిన సాల్వేరు సత్యనారాయణ కుమారుడు సాల్వేరు సాయిచరణ్, 61వ ర్యాంక్ (ఎం జెడ్ 2) సాధించారు.
సాయిచరణ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏసిక్ (ESIC – కార్మిక రాజ్య బీమా సంస్థ) లో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఇన్స్పెక్టర్) గా 6 సంవత్సరాలుగా పని చేస్తున్నారు.
గత అక్టోబర్ లో TSPSC ప్రకటించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (Divisional Accounts Officer) గెజిటెడ్ ఫలితాలలో, ఆయన రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించారు.
ఇప్పుడు గ్రూప్ 1 లో 61వ ర్యాంక్ సాధించడంతో, రాష్ట్ర అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని పొందారు.
ఈ విజయంతో, సాయిచరణ్ మొత్తం 10 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఘనత సాధించారు. ఈ సందర్భంగా, చరణ్ కు మిత్రులు, బంధువులు అభినందనలు తెలియజేశారు.