దక్షిణాది బ్యూటీ సమంత భారతదేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చేయనప్పటికీ ఆమె ప్రథమస్థానంలో నిలవడం విశేషం.
దీపికా పదుకొనే, అలియాభట్ లాంటి హీరోయిన్లు కూడా సమంత తర్వాతే ఉన్నారు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయింది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లిచేసుకుంది. తర్వాత హఠాత్తుగా విడిపోయారు. ప్రస్తుతం ముంబయిలోనే ఎక్కువగా నివసిస్తోంది. రెండు వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పగా ఇవి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. సినిమాల్లో అవకాశాలు రావడంలేదా? లేదంటే సమంతే సినిమాలు ఒప్పుకోవడంలేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత రావడంలేదు.
తనను తాను విశ్లేషించుకున్నాను
నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత తొలిసారిగా సమంత స్పందించింది. తాజాగా ఆమె మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరలవుతున్నాయి. ఒకసారి వివాహమై ఆ తర్వాత విడాకులు తీసుకున్న స్త్రీని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. తాను కూడా అలాంటి అవమానాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తనమీద చెప్పలేనంత, రాయలేనంత అబద్దాలను సృష్టించి ప్రచారం చేశారని, వాస్తవానికి అవన్నీ నిజాలుకాదు.. అన్నీ అబద్దాలు.. పుకార్లేనని చెప్పాలనిపించిందన్నారు. అయితే తనలో తాను మాట్లాడుకొని, తనను తాను విశ్లేషించుకున్న తర్వాత బహిరంగంగా వాటిగురించి మాట్లాడలేదని చెప్పింది.
మనసు విప్పి మాట్లాడింది
విడాకులు తీసుకున్న తర్వాత ఏరోజు కూడా తాను ఏడవకుండా లేనని, అయితే జీవితకాలం అలా ఏడుస్తూ ఉండిపోవాలని అనుకోలేదని, తనకు తాను ధైర్యం చెప్పుకొని అడుగు ముందుకు వేయాలనుకున్నట్లు చెప్పారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నానని సమంత స్పష్టం చేశారు. కెరీర్ పరంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, సొంత బ్యానరులో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పారు. రెండు వెబ్ సిరీస్ లు చేయాల్సి ఉంది. అలాగే కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అంగీకరించాలా? లేదా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత తొలిసారిగా సమంత మనసు విప్పి మాట్లాడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.